మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ లాంచ్; ధర రూ.41.50 లక్షలు
జర్మనీకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, తమ సరికొత్త అప్‌గ్రేడెడ ఈ-క్లాస్ లగ్జరీ కారును నేడు మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ప్రారంభ ధర రూ.41.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
యాక్టివ్ పార్క్ అసిస్ట్, ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్, ఈకో స్టార్ట్-స్టాప్, అటెన్షన్ అసిస్ట్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)తో కూడిన బ్రేక్ అసిస్ట్, ప్రీ సేఫ్ మరియు యాక్టివ్ బానెట్ వంటి సురక్షితమైన ఫీచర్లు ఈ కొత్త 2013 ఈ-క్లాస్ సొంతం. కొత్త పానరోమిక్ సన్‌రూఫ్, నాపా లెథర్ అప్‌హోలెస్ట్రీ, 3 యాంబీంట్ లైటింగ్ ఎఫెక్ట్స్, డ్యాష్‌బోర్డుపై ఓపెన్ పోర్ యాష్ ఉడ్ ఇంటీరియర్స్ వంటి కొత్త మార్పులను ఇందులో గమనించవచ్చు.
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ200 సిజిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ250 సిడిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.1 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 80 లీటర్లు. పెట్రోల్ వేరియంట్‌ను ట్యాంక్ ఫుల్ చేయిస్తే 1100 కి.మీ. (13.75 కెఎమ్‌పిల్ మైలేజ్) దూరం, డీజిల్ వేరియంట్ ట్యాంక్‌ను ఫుల్ చేయిస్తే 1380 కి.మీ (17.25 కెఎమ్‌పిల్ మైలేజ్) దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కొత్త బెంజ్ కారు వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ200 సిజిఐ - రూ.41.50 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ250 సిడిఐ - రూ.44.48 లక్షలు
- ఈ250 సిడిఐ లాంచ్ ఎడిషన్ (100 యూనిట్లు మాత్రమే) - రూ.49.90 లక్షలు
(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)













Click it and Unblock the Notifications








