మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్లాస్ విడుదల; ధర రూ.32.75 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో నేడు (సెప్టెంబర్ 30, 2014) మరో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. కాంపాక్ట్ లగ్జరీ క్రాసోవర్ సెగ్మెంట్లో అత్యంత సరమైన ధరకే మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.
భారత మార్కెట్లో కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్లాస్ ప్రారంభ ధర రూ.32.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎమ్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ ఆధారంగానే జిఎల్ఏ క్రాసోవర్‌ను అభివృద్ధి చేశారు.
జెనాన్ హెడ్‌ల్యాంప్స్, వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్, మ్యాట్ అల్యూమినియం ఫినిష్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు దీని సొంతం. అలాగే, ఏ-క్లాస్ కారులోని ప్లష్ ఇంటీరియర్స్‌ను ఇందులోను ఉపయోగించారు.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్లాస్ క్రాసోవర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి..!

తర్వాతి స్లైడ్‌లలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఈ క్రాసోవర్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 2.0 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 135 కి.వా. శక్తిని, 1200-1400 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు.

డీజిల్ వెర్షన్‌లో 2.2 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600-4400 ఆర్‌పిఎమ్ వద్ద 100 కి.వా. శక్తిని, 1600-3000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 205 కిలోమీటర్లు.

ఈ రెండు ఇంజన్లు కూడా 7జి-డిసిటి 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిన్ ఇటు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లో సౌకర్యాన్ని మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లోని డ్రైవింగ్ డైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుంది. దీని వలన గేరు మార్పిడి స్మూత్‌గా, ఫాస్ట్‌గా ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ-క్లాస్ ధరలు ఇలా ఉన్నాయి:
* జిఎల్ఏ సిడిఐ స్టైల్ - రూ.32.75 లక్షలు
* జిఎల్ఏ 200 స్పోర్ట్ - రూ.36.00 లక్షలు
* జిఎల్ఏ సిడిఐ స్పోర్ట్ - రూ.36.90 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








