నవంబర్ 19న కొత్త మినీ హ్యాచ్‌బ్యాక్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ, వచ్చే నెలలో రిఫ్రెష్డ్ వెర్షన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. మినీ బ్రాండ్‌లో 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ రెండు మోడళ్లలో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి.
విడుదల ఎప్పుడు?
మూడవ తరానికి చెందిన ఈ కొత్త మినీ హ్యాచ్‌బ్యాక్ నవంబర్ 19, 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇదివరకటి తరం మినీతో పోల్చుకుంటే ఈ కొత్త మినీ మరింత ఎక్కువ పరిమాణాన్ని, స్థలాన్ని కలిగి ఉంటుంది. వీటిలో పూర్తిగా కొత్త శ్రేణి ఇంజన్లను ఉపయోగించనున్నారు. కూపర్ ఎస్ పెట్రోల్, కూపర్ డి డీజిల్ మోడళ్లలో కొత్త మినీని ఆఫర్ చేయనున్నారు.

కొత్త ఇంజన్ ఆప్షన్స్
మినీ కూపర్ ఎస్ వేరియంట్‌లో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను, మినీ కూపర్ డి డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్, త్రీ-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతానికి కొత్త మినీ 3-డోర్, 5-డోర్ బాడీ స్టయిల్స్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో కన్వర్టిబల్ మరియు కంట్రీమ్యాన్ క్రాసోవర్ స్టయిల్ బాడీ స్టయిల్స్‌ను బిఎమ్‍డబ్ల్యూ ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది.
పాత మినీకి కొత్త మినీకి మధ్య తేడాలు ఏంటి?
ఇదివరకటి మినీ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే, దాని కన్నా కొత్త మినీ 98 మి.మీ పొడవును, 44 మి.మీ. వెడల్పును, 7 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త 5-డోర్ మినీ మొత్తం 4005 మి.మీ పొడవును, 1727 మి.మీ. వెడల్పును, 1425 మి.మీ. ఎత్తును మరియు 2567 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. రెగ్యులర్ 3-డోర్ మినీ కూపర్ హ్యాచ్‌తో పోల్చుకుంటే ఇది 162 మి.మీ. పొడవును, 11 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 278 లీటర్లు, వెనుక సీట్లను పోల్చుకుంటే 941 లీటర్లు.


Click it and Unblock the Notifications








