బెంగుళూరులో కొత్త మైక్రా విడుదల: ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
నిస్సాన్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన 2013 మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తాజాగా దేశపు ఐటి రాజధాని బెంగుళూరులో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదివరకటి మైక్రాతో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్ల పరంగా కొత్త మైక్రాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. బెంగుళూరు మార్కెట్లో 2013 నిస్సాన్ మైక్రా ప్రారంభ ధర రూ.4.88లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
కొత్త 2013 నిస్సాన్ మైక్రాలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ వెర్షన్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. నిస్సాన్ సన్నీలో ఉపయోగించిన ఎక్స్‌ట్రానిక్స్ సివిటి గేర్‌బాక్సునే ఈ కొత్త మైక్రాలోను ఉపయోగించారు. ఫలితంగా ఇది లీటరు పెట్రోలుకు 19.34 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
కొత్త మైక్రాలో ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లనే కొత్త మైక్రాలోను ఉపయోగించారు. మరి ఈ కొత్త 2013 నిస్సాన్ మైక్రా విశిష్టతలేంటో క్రింది ఎక్స్‌క్లూజివ్ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

పెట్రోల్ వేరియంట్లు, ధరలు
నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.4.88 లక్షలు
నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.5.52 లక్షలు
నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (ఆటోమేటిక్) - రూ.6.50 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

డీజిల్ వేరియంట్లు, ధరలు
నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.6.10 లక్షలు
నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.6.54 లక్షలు
నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి - రూ.7.01 లక్షల
నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి ప్రీమియం - రూ.7.26 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

సరికొత్త హెడ్‌ల్యాంప్స్

బ్లాక్ అండ్ బాడీ కలర్ సైడ్ వ్యూ మిర్రర్స్

సరికొత్త ఫాగ్ ల్యాంప్స్

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

స్టయిలిష్ అల్లాయ్ వీల్స్

ఇంటీరియర్స్

3-స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ఆడియో కంట్రోల్స్

మ్యూజిక్ సిస్టమ్

రౌండ్ డయల్స్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

అవుట్‍సైడ్ వ్యూ మిర్రర్ కంట్రోల్స్

యాంటీ స్కిడ్ పెడల్స్

5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

సెంటర్ కన్సోల్‌పై కప్ హోల్డర్స్

ఏసి వెంట్స్

ఇన్‌సైడ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్

సిల్వర్ ఫినిష్డ్ ఆర్మ్ రెస్ట్

పవర్‌ఫుల్ స్పీకర్స్

రియర్ సీట్ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్

అడ్జస్టబల్ రియర్ హెడ్ రెస్ట్స్



Click it and Unblock the Notifications








