అప్‌డేటెడ్ ఇంటీరియర్లతో 2014 రెనో పల్స్ విడుదల
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ సైలెంట్‌గా ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. రెనో పల్స్ కారును నిస్సాన్ మైక్రా ప్లాట్‍ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన సంగతి తెలిసినదే. నిస్సాన్ ఇటీవలే తమ మైక్రా కారులో అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది, కానీ రెనో మాత్రం తమ పల్స్ కారులో రిఫ్రెష్డ్ మోడల్‌ను విడుదల చేయలేదు.
ఈ నేపథ్యంలో, తాజాగా రెనో ఇండియా కూడా తమ పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసింది. అయితే, ఈ మార్పులు కేవలం ఇంటీరియర్లకు మాత్రమే పరిమితం కానున్నాయి. కొత్త రెనో ఎక్స్టీరియర్ డిజైన్‌లో కానీ లేదా మెకానికల్‌గా కానీ ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఆ ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇదివరకటి పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారులోని బీజ్ కలర్డ్ ప్లాస్టిక్ సెంటర్ కన్సోల్‌ను కొత్త నిస్సాన్ మైక్రాలో చూసినట్లుగా పియాన్ బ్లాక్ గ్లాసీ ఫినిష్‌తో రీప్లేస్ చేశారు. ఇది కారు ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం అప్పీల్‌నిస్తుంది. బేస్ పెట్రోల్ వేరియంట్ (ఆర్ఎక్స్ఈ)లో మినహా ఇతర అన్ని వేరియంట్లలో ఈ పియానో-బ్లాక్ సెంటర్ కన్సోల్ లభిస్తుంది.

అంతేకాకుండా.. అప్‌డేటెడ్ రెనో పల్స్ కారులో 2-డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్ సహితంగా)ను ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సీట్ కవర్లను కూడా రివైజ్ చేశారు. మొత్తమ్మీద కొత్త నిస్సాన్ మైక్రా ఇంటీరియర్‌లో చేసిన మార్పులను కొత్త పల్స్‌లో కొనసాగించారు. కొత్త రెనో పల్స్ ఇంజన్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లతోనే లభిస్తుంది.


Click it and Unblock the Notifications








