కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్' స్పెషల్ ఎడిషన్

By Ravi

బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన మారుతి సుజికి అధీకృత డీలర్‌షిప్ 'కళ్యాణి మోటార్స్' మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రియుల కోసం ఓ ఆకర్షనీయమైన వేరియంట్‌ను ఆఫర్ చేస్తోంది. కర్ణాటకలో అత్యంత పాపులర్ అండ్ ట్రస్టెడ్ మారుతి సుజుకి డీలర్‌షిప్ అయిన కళ్యాణి మోటార్స్ 'స్విఫ్ట్ కె క్లాస్' పేరిట ఓ హైలీ కస్టమైజ్డ్ స్విఫ్ట్ కారును ప్రత్యేకంగా విక్రయిస్తోంది.

ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కె క్లాస్ కారును, మారుతి సుజుకి ఇండియా అధికారికంగా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ కాదు. ఇది ప్రత్యేకించి డీలర్ స్పెసిఫిక్ స్విఫ్ట్ కారుగా తెలుస్తోంది. కళ్యాణి మోటార్స్ డీలర్‌షిప్ ఈ స్విఫ్ట్ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి కొనుగోలుదారులకు విక్రయిస్తోంది. కళ్యాణి మోటార్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ 'స్విఫ్ట్ కె క్లాస్' కారులోని స్పెషాలిటీలు ఏంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి మోటార్స్ అందిస్తున్న ఈ స్విఫ్ట్ కె క్లాస్ ఎక్స్టీరియర్ స్పోర్టీ యల్లో కలర్‌తో లభిస్తుంది. రెగ్యులర్ స్విఫ్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కె క్లాస్ స్విఫ్ట్ కారును తయారు చేశారు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

స్విఫ్ట్ కె క్లాస్ ఎక్స్టీరియర్‌లో ఏ, బి పిల్లర్స్ మినహా మిగిలిన కారు మొత్తం పసుపు రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది. దీనికి కంపెనీ అదనపు బాడీ కిట్‌ను అందిస్తోంది.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్‌లో ఫ్రంట్ బంపర్‌లో కూడా మార్పు ఉంది. బంపర్‌కు అదనపు బాడీ కిట్‌ను జోడించడంతో పాటుగా, గ్రిల్ క్రింది భాగంలో బ్లాక్ కలర్‌ను మిగిలిన భాగాన్ని బాడీ కలర్‌తోను పెయింట్ చేశారు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్‌లో ఆడి కార్లను తలపించేలా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో స్మోక్డ్ ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌లైట్స్ మరో ప్రత్యేకతగా నిలుస్తాయి.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ నలుపు రంగు అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. ఈ వీల్స్ మధ్య భాగంలో సిల్వర్ క్రోమ్ సుజుకి లోగో ఉంటుంది.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ వెనుక వైపు మరింత ప్రీమియం లుక్‌ని కల్పించేందుకు దీని సైలెన్సర్‌కు ఓ క్రోమ్ టిప్‌ను జోడించారు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ వెనుక వైపు స్విఫ్ట్ బ్యాడ్జింగ్ కూడా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే, ఇది భిన్నంగా ఉంటుంది.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

అలాగే, కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్ కూడా స్మోక్డ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ డోర్ క్రింది భాగంలో రన్నింగ్ బోర్డుపై అమర్చిన స్పెషల్ బాడీ కిట్, వీల్ ఆర్చెస్‌కు దిగువన అమర్చిన ఫ్రంట్ బంపర్‌ను కలుపుతూ జోడించిన బాడీ కిట్‌ను ఇందులో చూడొచ్చు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

టాప్-ఎండ్ వేరియంట్ స్విఫ్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కె క్లాస్ స్విఫ్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్‌ను చూడొచ్చి. ఇవి కూడా బాడీ కలర్‌లోనే లభిస్తాయి.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి స్విఫ్ట్ కె క్లాస్ కారు ఫ్రంట్ బంపర్‌కు అమర్చిన బాడీ కలర్ క్లాడింగ్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి మోటార్స్ అందిస్తున్న ఈ స్విఫ్ట్ కె క్లాస్‌లో మార్పులను కేవలం ఎక్స్టీరియర్లకే పరిమితం చేయకుండా, ఇంటీరియర్లలో కూడా మార్పులు చేసింది. యల్లో స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్ ప్రీమియం లెథర్ సీట్లను ఈ ఫొటోలో చూడొచ్చు.

కళ్యాణి మోటార్స్ నుంచి 'స్విఫ్ట్ కె క్లాస్'

కళ్యాణి మోటార్స్ తమ స్విఫ్ట్ కె క్లాస్ కారుకు సంబంధించిన ధర ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం బెంగుళూరులోని అధీకృత కళ్యాణి మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

కళ్యాణి స్విఫ్ట్ ప్లాటినం ఎడిషన్

ఇది కూడా చదవండి: కళ్యాణి స్విఫ్ట్ ప్లాటినం ఎడిషన్

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2014, 12:28 [IST]
English summary
Bangalore based Maruti Suzuki official dealer Kalyani Motors is offering special edition swift called as 'K Class'. Now it is available at Kalyani Motors. Please visit the stores for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+