కొత్త 2014 టాటా ఆరియా విడుదల; ధర రూ.9.95 లక్షలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న తమ ఆరియా ఎమ్‌పివిలో ఓ కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2014 టాటా ఆరియాలో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త 2014 ఆరియా బేస్ వేరియంట్లో సైతం కంపెనీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ఆఫర్ చేస్తుండటం విశేషం.
టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్తగా మెరుగు పరచిన 2.2 లీటర్ వారికార్ డీజిల్ ఇండన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను మరింత రీఫైన్ చేశామని, ఇది మెరుగైన మైలేజీనిస్తుందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొత్త టాటా ఆరియా ఇప్పుడు మూడు వేరియంట్లలో (ప్యూర్ 4X2, ప్లెజర్ 4X2 మరియు ప్రైడ్ 4X4) లభ్యం కానుంది. బేస్ వేరియంట్లో (ప్యూర్ 4X2లో) ఇదివరకు చెప్పుకున్నట్లుగా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, రియర్ ఎయిర్ కండిషన్ వెంట్స్, సన్‌గ్లాస్ హోల్డర్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, ఫాలో-మి-హోమ్ ల్యాంప్స్, డిస్క్ బ్రేక్స్‌ను అందిస్తున్నారు.
ఇకపోతే మిడ్ లెవల్ వేరియంట్ అయిన ప్లెజర్ 4X2లో పై ఫీచర్లకు అదనంగా డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రూఫ్ స్టోరేజ్ బిన్స్, చిల్డ్ గ్లవ్ బాక్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో పాటుగా రియర్ వైపర్ అండ్ డిఫాగ్గర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇంకా ఇందులో క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఫుల్ క్రోమ్ గ్రిల్, హాడీ కలర్డ్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లున్నాయి.

టాప్ ఎండ్ వేరియంట్ అయిన ప్రైడ్ 4X4లో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, లెథర్ సీట్స్, శాటిలైట్ నావిగేషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లాక్ సరౌండ్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌పి, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.
కొత్త 2014 టాటా ఆరియా ధరలు రూ.9.95 లక్షల నుంచి రూ.14.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








