జులై నెలలో కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో విడుదల!

By Ravi

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు 'పోలో'లో కంపెనీ ఇటీవలే ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను యూరప్ మార్కెట్లలో విడుదల చేసింది. మునుపటి వెర్షన్ పోలోతో పోల్చుకుంటే కొద్దిపాటి కాస్మోటిక్, ఫీచర్ అప్‌డేట్స్‌తో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పోలోను అప్‌గ్రేడ్ చేశారు.

జులై 2014 నెలలో ఈ సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు సమచారం. కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త లుక్, కొత్త ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్లను కూడా కలిగి ఉంది.

2014 Volkswagen Polo

ఇండియన్ వెర్షన్ పోలో కారులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.6 లీటర్ ఇంజన్‌కు బదులుగా 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ పరిమాణం చిన్నదైనప్పటికీ, ఇది 1.6 లీటర్ ఇంజన్ మాదిరిగానే 105 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాక్స్ తగ్గించుకునేదుకు ఫోక్స్‌వ్యాగన్ ఈ ఇంజన్ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యూరోపియన్ వెర్షన్ 2014 పోలో కొత్త బంపర్, హెడ్‌ల్యాంప్స్, ఆప్షనల్ ఈఎల్ఈ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు లైట్‌గా క్రోమ్ టచ్, వెనుక వైపు కొత్త టెయిల్ లైట్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ వంటి కాస్మోటిక్ మార్పులు చాలానే ఉన్నాయి. ఇంటీరియర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2014, 9:37 [IST]
English summary
The new VW Polo hatchback is one facelift model that we are eagerly looking forward to. Launched in Europe earlier this year, the 2014 VW Polo is a minor update over the outgoing Polo, but it still makes the car look significantly better and mature.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+