కొత్త 2014 వోల్వో ఎస్80 విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ వోల్వో, భారత మార్కెట్లో తమ అప్‌గ్రేడెడ్ ఎస్80 లగ్జరీ సెడాన్‌ను విడుదల చేసింది. ఇదివరకటి వోల్వో ఎస్80తో పోల్చుకుంటే, ఈ కొత్త 2014 వోల్వో ఎస్80 కారులో అనేక కాస్మోటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా ఫీచర్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది వాటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* వోల్వో ఎస్80 డి4 - రూ.41.35 లక్షలు
* వోల్వో ఎస్80 డి5 - రూ.44.80 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

కొత్త 2014 వోల్వో ఎస్80 లగ్జరీ సెడాన్ మంచి ధరకు తగిన విలువను కలిగి ఉండి, ఈ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బంపర్స్, హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులను ముందు వైపు గమనించవచ్చు. అలాగే వెనుక వైపు కూడా టెయిల్ ల్యాంప్స్, బంపర్‌లలో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో విభిన్నమైన డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. ఇవి కారుకు మంచి లుక్‌నిస్తాయి.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఇక ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఫ్లోటింగ్ డిజైన్ కలిగిన సెంటర్ కన్సోల్, 7 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో డ్యాష్‌బోర్డుపై ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (రెగ్యులర్, పెర్ఫార్మెన్స్ మోడ్స్ ఉంటాయి), ఆల్ బ్లాక్ ప్యానెల్స్, అక్కడక్కడా ఉడెన్ ఇన్‌సెర్ట్స్‌తో ఇది మంచి లగ్జరీ లుక్‌ని కలిగి ఉంటుంది.

ఇంజన్

ఇంజన్

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త 2014 వోల్వో ఎస్80 డి4 వేరియంట్లోలో 2.0 లీటర్, ఫైవ్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 165 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే డి5 వేరియంట్లోలో 2.4 లీటర్, ఫైవ్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 215 పిఎస్‌ల శక్తిని, 440 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్‌

ట్రాన్సిమిషన్‌

ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి మరియు ఇంజన్ నుంచి వచ్చే శక్తి వెనుక చక్రాలకు (రియల్ వీల్ డ్రైవ్) బదిలీ అవుతుంది. వోల్వో ఎస్80 కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు.

భద్రతా ఫీచర్లు

భద్రతా ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ట్రాక్షన్ కంట్రోల్, ఆప్టిమల్ బ్రేకింగ్, పవర్ డెలివరీ, స్టీరింగ్‌తో పాటు తిరిగే హెడ్‌ల్యాంప్స్, వోల్వో ఇంటెలిసేఫ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2014, 10:19 [IST]
English summary
The 2014 Volvo S80 has been launched in India without much fanfare. The new S80 is a minor update over last year's model, but still remains the same simple looking, yet elegant sedan that the Volvo has always been.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+