నవంబర్ 25న నెక్స్ట్ జనరేషన్ హోండా సిటీ ఆవిష్కరణ
జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటాక్ కార్పోరేషన్ ఈ నవంబర్ నెలలో తమ కొత్త తరం హోండా సిటీ సెడాన్ (కోడ్‌నేమ్: 2సిటి)ను ఆవిష్కరించనున్నట్లు గడచిన నెలాఖరున తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, సరికొత్త హోండా సిటీ సెడాన్ నవంబర్ 25న ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో, హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో ఇప్పటికే ప్రస్తుత సిటీ సెడాన్ ఉత్పత్తిని నిలిపి వేసింది.
సెప్టెంబర్ 2013 నెలలో 2,043 యూనిట్ల సిటీ కార్లు అమ్ముడుపోతే, అక్టోబర్ నెలలో కేవలం 31 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే, కొనుగోలుదారులు కూడా కొత్త సిటీ సెడాన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరోవైపు హోండా డీలర్లు ఇప్పటికే కొత్త హోండా సిటీ సెడాన్ కోసం బుకింగ్‌లను కూడా అంగీకరిస్తున్నారని, ఇందుకోసం డీలర్లు రూ.50,000 బుకింగ్ మొత్తాన్ని స్వీకరిస్తున్నట్లు సమాచారం.

కాగా.. హోండా నుంచి తాజాగా రానున్న ఈ కొత్త తరం సిటీ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానునట్లు తెలుస్తోంది. నవంబర్ 25న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కొత్త హోండా సిటీ సెడాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణకు కూడా ఇదే వేదిక కానుంది. ఇదిలా ఉండగా, కొత్త సిటీ సెడాన్ మార్కెట్లోకి వచ్చే లోపుగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిటీ సెడాన్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు డీలర్లు ఈ పాత మోడల్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








