తక్షణమే భారత్‌లో డాట్సన్ గో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం

గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్టులో నిస్సాన్‌కు చెందిన బడ్జెట్ కార్ 'డాట్సన్ గో' సేప్టీలో జీరో రేటింగ్‌ను దక్కించుకొని, ఘోరంగా విఫలం కావటంతో, ఈ మోడల్‌ను ఇండియన్ మార్కెట్ నుంచి తక్షణమే తొలగించి వేయాల్సిందిగా నిస్సాన్ కంపెనీ గ్లోబల్ ఎన్‌సిఏపి కోరింది.

గ్లోబల్ ఎన్‌సిఏపి చైర్మన్ మాక్స్ మోస్లీ ఈ మేరకు నిస్సాన్ సీఈఓ కార్లోస్ ఘోస్న్‌కు ఓ పర్సనల్ లెటర్ వ్రాయటం జరిగింది. ఆ లెటర్‌లో, డాట్సన్ గో ప్రాథమిక భద్రతా పరీక్షలలో విఫలమైన కారణంగా, ఈ మోడల్‌ను తక్షణమే భారత మార్కెట్ నుంచి తొలగించాలని కార్లోస్ ఘోస్న్‌ను మాక్స్ మోస్లీ కోరారు.


నిస్సాన్ 30 ఏళ్ల క్రితం నిలిపివేసిన డాట్సన్ బ్రాండ్‌ని తిరిగి ఈ ఏడాది పునఃప్రవేశపెట్టి, ఇందులో గో అనే హ్యాచ్‌బ్యాక్‌ను మొట్టమొదటి సారిగా విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత్‌లో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోయినప్పటికీ, క్రమక్రమంగా అమ్మకాలు మెరుగుపడుతూ వస్తున్నాయి.

భారత మార్కెట్లో అమ్ముడుపోతున్న డాట్సన్ గో కారులో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి కనీస సేఫ్టీ ఫీచర్లు కూడా లేవు. అంతేకాకుండా.. గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు బాడీ నిర్మాణం కూడా నాసిరకంగా ఉందని, ఒకవేళ ఈ కారుకు ప్రమాదం జరిగితే కారులో ఏ ఒక్కరూ బ్రతికే చాన్స్ లేదని తేలింది.

Datusn Go Crash Test

నాణ్యత లేని నిర్మాణం కారణంగా, ఈ కారులో ఎయిర్‌బ్యాగ్స్ జోడించినప్పటికీ పెద్ద ఫలితం ఉండదని గ్లోబల్ ఎన్‌సిఏపి పేర్కొంది. ఇలాంటి ప్రమాణాలతో తయారైన కారును ప్రపంచంలోని అనేక దేశాల్లో అమ్మడుకావటానికి అర్హత సాధించదు. యూఎస్, యూకే వంటి దేశాల్లో అమ్ముడయ్యే కార్లలో కనీసం 5 స్టార్లకు గాను 4 స్టార్ల సేఫ్టీ రేటింగ్‌నైనా పొందాల్సి ఉంటుంది.

నిస్సాన్ ఇలాంటి నాసిరకం ప్రమాణాలతో కూడిన ఓ సరికొత్త మోడల్‌ను విడుల చేయటం చాలా నిరుత్సాహకరమని, ఇండియాలో డాట్సన్ గో అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, కారును నాణ్యమైన, ధృడమైన బాడీ ఫ్రేమ్‌తో రీడిజైన్ చేసి విక్రయించాలని తాను నిస్సాన్ సంస్థను కోరుతున్నానని గ్లోబల్ ఎన్‌సిఏపి చైర్మన్ మాక్స్ మోస్లీ తన లేఖలో పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 7, 2014, 9:29 [IST]
English summary
The Global New Car Assessment Program (NCAP) has now asked Nissan to withdraw the Datsun GO from the Indian market. Max Mosley, chairman of (NCAP), has demanded this via a personal letter to Nissan's CEO, Carlos Ghosn, after the car failed to pass basic safety tests, asking the company to stop sales of the Datsun GO immediately in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+