డస్టర్ ఆధారిత నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు 'టెర్రానో'

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భారత మార్కెట్లో అందిస్తున్న డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు మనం గతంలో పలు కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో, నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేసిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీకి 'టెర్రానో' (Terrano) అనే పేరును ఖరారు చేశామని, అతి త్వరలోనే ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెడతామని నిస్సాన్ ప్రకటించింది.

అంతేకాకుండా, నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ అఫీషియల్ డిజైనర్ స్కెచ్‌ను కూడా నిస్సాన్ ఇండియా ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రెనో-నిస్సాన్ సంస్థలు ఒకరి ఉత్పత్తుల ప్లాట్‌ఫామ్‌ను మరొకరు పంచుకొని, కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన ఒకేరకమైన ఉత్పత్తులను వేర్వేరు పేర్లతో అందిస్తున్న సంగతి తెలిసనదే. ఉదాహరణకు నిస్సాన్ మైక్రా, రెనో పల్స్ మరియు నిస్సాన్ సన్నీ, రెనో స్కాలా మోడళ్లు ఇదే ఫార్ములాపై రూపొందించబడ్డాయి.

ఇదే విధంగా, రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో ఉత్పత్తులు కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనున్నాయి. అంటే, ఈ రెండు మోడళ్లలో దాదాపు ఒకేరకమైన ఫీచర్లు, ఇంజన్లు ఉండనున్నాయి. అయితే డిజైన్ మాత్రం కాస్తంత భిన్నంగా ఉంటుంది. సాధారణంగా రెనో కార్లతో పోల్చుకుంటే నిస్సాన్ కార్లు తక్కువ ధరను కలిగి ఉంటాయి. కానీ తాజాగా వస్తున్న నిస్సాన్ టెర్రానో మాత్రం రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్న ఎక్కువ ధరను కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Nissan Confirms Terrano Premium Compact SUV

More from DriveSpark

Article Published On: Tuesday, June 11, 2013, 14:17 [IST]
English summary
Nissan announces the name of its new Premium Compact SUV - Terrano. Coming soon at a Nissan Dealership near you. Check out the official exclusive designer’s sketch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+