ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న 'నిస్సాన్ ఈ-ఎన్‌వి200' (ఇవాలియా)
గడచిన 2012లో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న 'ఎన్‌వి200' (మన మార్కెట్లో ఇవాలియా పేరుతో లభిస్తోంది) ఎమ్‌పివిలో ఓ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది.
ఉత్పత్తికి సిద్ధంగా నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివి మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించనుంది. నిస్సాన్ తమ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్, ప్రముఖ బెవెరేజెస్ కెంపనీ కోకకోలాలతో కలిసి నిస్సాన్ టెస్టింగ్ నిర్వహించింది.
నిస్సాన్ తమ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో ఒక ప్యాసింజర్ వెర్షన్‌ను మరొక కమర్షియల్ వెర్షన్‌ను రూపొందించింది. వచ్చే మే నెల నుంచి అందుబాటులోకి రానుంది. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అవార్డ్ విన్నింగ్, వరల్డ్స్ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా పేరు గాంచిన నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారులోని డ్రైవ్‌ట్రైన్ (ఇంజన్/మోటార్)నే నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ లీఫ్‌తో సమానంగా ఉన్నప్పటికీ, ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్ మరో అదనపు అడ్వాంటేజ్‌గా నిలుస్తుంది.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలోని ఎలక్ట్రిక్ మోటార్ 24 కివాట్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 107 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేసే రేంజ్ (మైలేజ్)నే నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివి కూడా ఆఫర్ చేయనుంది. ఇది సుమారు 130 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలోని బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లో 80 శాతం చార్జ్ అవుతాయి.

ప్యాసింజర్ వెర్షన్ నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలో ఒక బ్యాటరీ, ఒక మోటార్ ఉంటాయి. అలాగే, గరిష్ట పేలోడ్‌ను దృష్టిలో ఉంచుకొని కార్గో వెర్షన్ నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలో అదనపు బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








