దీపావళి నాటికి మార్కెట్లోకి రానున్న అప్‌గ్రేడెడ్ ఇవాలియా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా భారీ అంచనాలతో మార్కెట్లో ప్రవేశపెట్టిన ఇవాలియా ఎమ్‌పివి ఇక్కడి మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఇది సగటున నెలకు 175 యూనిట్ల కంటే మించి అమ్ముడుపోవటం లేదు. నిస్సాన్ ఇవాలియాను కొనుగోలుదారులు ఆదరించకపోవటానికి ప్రధాన కారణం దీని డిజైన్ మరియు ఫీచర్లే అని తెలుస్తోంది. దీంతో కంపెనీ ఇప్పడు దిద్దుబాటు చర్యలు చేస్తోంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, సరికొత్త ఫీచర్లతో కూడిన ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్ ఇవాలియా ఎమ్‌పివి రానున్న దీపావళి నాటికి నిస్సాన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నహాలు చేస్తుంది. కొత్త ఇవాలియాలో ప్రధానంగా ఇంటీరియర్లలో మార్పులు ఉండనున్నాయి.

ఇవాలియా ఎమ్‌పివిలోని రెండవ వరుసలో మంచి సుపీరియర్ కుషన్ కలిగి కెప్టెన్ సీట్లను, మూడవ వరుసలో ఉన్న బట్టర్‌ఫ్లై అద్దాలను స్లైడర్ అద్దాలుగా కూడా మార్చనున్నారు. కొత్త బంపర్, లైట్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను కూడా 2013 ఇవాలియాలో మనం ఆశించవచ్చు. అయితే, ఇంజన్ పరంగా మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నిస్సాన్ ఇవాలియాలో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇంజన్:

ఇంజన్:

1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌

పవర్ - 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిలు

టార్క్ - 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌లు

ట్రాన్సిమిషన్:

ట్రాన్సిమిషన్:

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్)

మైలేజ్:

మైలేజ్:

20 కెఎమ్‌పిఎల్

కొలతలు:

కొలతలు:

బరువు - 1426 కేజీలు

పొడవు - 4400 మి.మీ.

వెడల్పు - 1695 మి.మీ.

ఎత్తు - 1880 మి.మీ.

గ్రౌండ్ క్లియరెన్స్ - 180 మి.మీ.

సేఫ్టీ ఫీచర్లు:

సేఫ్టీ ఫీచర్లు:

ఇందులో ఫ్రంట్ సీట్లలోని డ్రైవ్ ప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ (బేస్ ఎక్స్ఈ వేరియంట్ మినహా), ముందు వైపు డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్, బ్రేక్ అసిస్ట్ మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, డోర్లు సరిగ్గా వేయకపోతే హెచ్చరించే డోర్ అజర్ వార్నింగ్ వంటి సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.

కంఫర్ట్ ఫీచర్లు:

కంఫర్ట్ ఫీచర్లు:

ఇందులో హీటర్‌తో కూడిన మ్యాన్యువల్ ఎయిర్ కండిషనర్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి వేరియంట్లలో వెనుక ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్, టాప్ ఎండ్ వేరియంట్ (ఎక్స్‌వి)లో రియర్ వ్యూ కెమెరా, ఏఎమ్, ఎఫ్ఎమ్, సిడి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లున్నాయి.

కంఫర్ట్ ఫీచర్లు:

కంఫర్ట్ ఫీచర్లు:

అంతేకాకుండా.. ముందు వైపు డోర్లకు పవర్ విండోస్, వెనుక వైపు సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల సౌకర్యం కోసం ముందు సీట్లకు వెనుక భాగంలో అమర్చిన ఫోల్డబల్ ప్లాస్టిక్ టేబుల్స్, డ్రైవర్ ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉన్న సీట్, రెండవ వరుసులో విడివిడిగా మడుచుకునేందుకు వీలున్న స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు కూడా నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి సొంతం.

టెక్నాలజీ ఫీచర్లు:

టెక్నాలజీ ఫీచర్లు:

ట్రిప్ కంప్యూటర్, ప్రయాణించే వేగాన్ని తెలిపే క్రూయిజ్ రేంజ్, మైలేజ్‌ను తెలిపే రియల్ టైమ్ ఫ్యూయెల్ మైలేజ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, టాకోమీటర్ మొదలైన ఫీచర్లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్‌టాప్స్ వంటి గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 12 వోల్ట్ పవర్ సాకెట్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

కారు బాడీ రంగులో ఉండే బంపర్స్ మరియు సైడ్ మిర్రర్స్, వెనుక సీట్లలోకి ప్రయాణికులు సులువుగా ప్రవేశించేందుకు, కారులో నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్లైడింగ్ డోర్స్, యాంత్రికంగా నియంత్రించబడే సైడ్ మిర్రర్స్, టాప్ ఎండ్ వేరియంట్లో ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

నిస్సాన్ ఇవాలియా

క్లచ్ ఫుట్ రెస్ట్

నిస్సాన్ ఇవాలియా

పవర్‌ఫుల్ ఏసి

నిస్సాన్ ఇవాలియా

కప్ హోల్డర్లతో కూడిన సెంటర్ కన్సోల్

నిస్సాన్ ఇవాలియా

గ్యాడ్జెట్ల కోస 12 వోల్ట్ పవర్ సాకెట్

నిస్సాన్ ఇవాలియా

సెంటర్ కన్సోల్‌పై స్టోరేజ్ స్పేస్

నిస్సాన్ ఇవాలియా

ఏఎమ్, ఎఫ్ఎమ్, సిడి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్

నిస్సాన్ ఇవాలియా

యాంత్రికంగా నియంత్రించబడే సైడ్ మిర్రర్స్ స్విచ్

నిస్సాన్ ఇవాలియా

డ్యాష్ బోర్డుపై స్టోరేజ్ స్పేస్

నిస్సాన్ ఇవాలియా

డ్యాష్ బోర్డుకు ఏర్పాటు చేసిన స్టోరేజ్ స్పేస్

నిస్సాన్ ఇవాలియా

డ్యాష్ బోర్డుపై కప్ హోల్డర్

నిస్సాన్ ఇవాలియా

సైడ్ డోర్లకు మ్యాగజైన్ పాకెట్స్

నిస్సాన్ ఇవాలియా

ఇవాలియా ఎక్స్టీరియర్

నిస్సాన్ ఇవాలియా

ఇవాలియా ఎక్స్టీరియర్

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2013, 17:09 [IST]
English summary
AutocarIndia has learnt that a slightly redesigned Evalia, with a premium interior, will be launched during the festival of lights.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+