ఫేస్‌‌లిఫ్ట్ నిస్సాన్ ఇవాలియా విడుదల; ధర రూ.10.55 లక్షలు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా సైలెంట్‌గా ఓ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఇవాలియా ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా, ఇందులో ఓ టాప్-ఎండ్ వేరింయట్‌ (ఎక్స్‌వి ఎస్)‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ నిస్సాన్ ఇవాలియా ఎక్స్‌విఎస్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ ఇవాలియాలో రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్, స్లైడింగ్ మిడిల్-రో విండో, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (ఇదివరకు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించే వారు), రియర్ వైపర్ అండ్ వాషర్ వంటి మార్పులు చేర్పులు చేసారు. అయితే, ఈ కొత్త నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో యాంత్రికపరమైన మార్పులు మాత్రం లేవు.

Nissan Evalia Facelift

ఇదివ వరకటి నిస్సాన్ ఇవాలియాలో ఉపయోగించిన అదే 1.5 లీటర్ డిసిఐ కె9కె డీజిల్ ఇంజన్‌నే కొత్త ఇవాలియాలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‍‌పిల శక్తిని, 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

అయితే, ప్రస్తుతానికి ఈ అప్‌డేటెడ్ నిస్సాన్ ఇవాలియా టాప్-ఎండ్ వేరియంట్లో (ఎక్స్‌వి ఎస్) మాత్రమే లభ్యం కానుంది. దీని ధర ఇది వరకటి టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌వి) కన్నా దాదాపు రూ.30,000 అధికం. కాగా.. 2012 వెర్షన్ ఇవాలియాపై నిస్సాన్ ఇండియా సుమారు రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Tuesday, October 15, 2013, 14:38 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+