రేస్ గేమ్ ప్రియులకు లక్కీ ఛాన్స్.. 'నిస్సాన్ జిటి అకాడమీ'
ఇండియన్ గేమింగ్ ప్రియులకు మరియు మోటార్‌స్పోర్ట్ ఔత్సాహికులకు ఓ గుడ్‌న్యూస్.. జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ తమ 'జిటి అకాడమీ' కార్యక్రమాన్ని భారత్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. నేడు (ఫిబ్రవరి 4, 2014) గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిస్సాన్ జిటి అకాడమీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
నిస్సాన్ తమ జిటి అకాడమీని తొలిసారిగా 2008లో ప్రారంభించింది, అనతికాలంలోనే ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ జిటి అకాడమీ ప్రోగ్రామ్‌లో భాగంగా నిస్సాన్ గేమింగ్ ప్రియులను గుర్తించి, వారికి రియల్ వరల్డ్ కార్ రేసింగ్ అనుభూతిని కల్పించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యత పాపులర్ అయిన 'గ్రాన్ తురిస్మో 6' రేసింగ్ గేమ్‌లో అభ్యర్థుల యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని, నిస్సాన్ తమ జిటి అకాడమీ ప్రోగ్రామ్‌లో వారికి అవకాశం కల్పిస్తుంది.

నిస్సాన్ ఇందుకోసం సిమ్యులేటర్లను ఉపయోగిస్తుంది. ఈ సిమ్యులేటర్ల ద్వారా గేమ్ ఆడే వారిలో నిపుణులైన వారిని సెలక్ట్ చేసుకొని, వారికి రియల్ వరల్డ్ రేసింగ్ అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇందులో పాల్గొనే అభ్యర్థలను షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియను నిస్సాన్ ఈ 2014 ఆటో ఎక్స్‌పో వద్ద ప్రారంభించనుంది. ఇందులో పాల్గొనే అభ్యర్థులు ప్రత్యేంగా నిర్మించిన సిమ్యులేటర్లపై తమ ప్రతిభను కనబరచాల్సి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో తర్వాత నిస్సాన్ దేశంలోని గుర్గావ్, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు మరియు చెన్నై ప్రాంతాల్లో కూడా మరికొద్ది నెలల్లోనే ఈ జిటి అకాడమీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచే టాప్ 14 అభ్యర్థులను ఎంచుకొని, నిస్సాన్ వారికి ఫిజికల్ ట్రైనింగ్ సెషన్ ఇస్తుంది. ఇందులో ఆరుగురిని ఎంచుకొని, యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో నిస్సాన్ యొక్క ఇంటర్నేషనల్ రేస్ క్యాంప్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తుంది.

సిల్వర్‌స్టోన్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా టాప్ 18 డ్రైవర్లు పోటీపడి రియల్ రేస్ కార్స్ (370జెడ్ మరియు జిటి-ఆర్ కార్ల)తో రేస్‌లో పాల్గొంటారు. ఇందులో ఉత్తమంగా నిలిచిన బెస్ట్ డ్రైవర్ నిస్సాన్ డ్రైవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ఎంపికవుతాడు.

ఇలా ఎంపికైన బెస్ట్ డ్రైవర్‌కు నిస్సాన్ పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి తమ రేస్ బృందంలో చేర్చుకుంటుంది.

జిటి అకాడెమీలో చేరాలనుకునే వారికి అర్హతలున్నాయి. వీరు వయస్సులో 18 ఏళ్లకు పైబడి ఉండి, చెల్లుబాటైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఇందుకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, గతంలో ఇదివరకు ఏరకమైన రేసులో పాల్గొని ఉన్న ప్రొఫెషనల్ డ్రైవర్లకు మాత్రం ఈ కార్యక్రమంలో చేరేందుకు అర్హత లేదు.

మరికొద్ది నెలల్లో ప్రతిఒక్కరూ ఇందులో పాల్గొనే విధంగా ఆన్‌లైన్ ఎంట్రీలను ప్రారంభిస్తామని నిస్సాన్ పేర్కొంది. ఇందులో ప్లేస్టేషన్ 3 గేమింగ్ కన్సోల్ మరియు గ్రాన్ తురిస్మో 6 గేమ్‌లను ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications








