నిస్సాన్ సివిటి ట్రాన్సిమిషన్ టెక్నాలజీ: ఫుల్ డిటేల్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ సన్నీ సెడాన్లలోని పెట్రోల్ వెర్షన్లలో సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. నిస్సాన్ ఈ సివిటి సిస్టమ్‌ను 'ఎక్స్‌ట్రానిక్ సివిటి' (XTRONIC CVT) అని పిలుస్తుంది.
ఈ నేపథ్యంలో, తమ ఎక్స్‌ట్రానిక్ సివిటి టెక్నాలజీ పనితీరును, దాని వలన కలిగే ప్రయోజనాల గురించి కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించేందుకు కంపెనీ ప్రత్యేకంగా పలు నగరాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బెంగుళూరులో నిస్సాన్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో నిస్సాన్ తమ ఎక్స్‌ట్రానిక్ సివిటి గురించి వెల్లడించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సాంప్రదాయ (రెగ్యులర్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పోల్చుకుంటే, నిస్సాన్ ఆఫర్ చేస్తున్న ఎక్స్‌ట్రానిక్ సివిటి గేర్‌బాక్స్ వలన అనేక ప్రయోజనాలున్నాయని కంపెనీ పేర్కొంది. అవేంటో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

స్టీల్ బెల్ట్ లేదా పుల్లీ సిస్టమ్
నిస్సాన్ అందిస్తున్న ఎక్స్‌ట్రానిక్ సివిటి గేర్‌బాక్స్ స్టీల్ బెల్ట్ లేదా పుల్లీ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్టీల్ బెల్ట్ లేదా పుల్లీ సిస్టమ్ వలన ఎలాంటి మెకానికల్ షిఫ్టింగ్ అవసరం లేకుండా, స్మూత్‌గా గేర్లను పెంచేందుకు, తగ్గించడం వీలవుతుంది.

గేర్ హంటింగ్, షిఫ్ట్-షాక్ ఎలిమినేట్
సాంప్రదాయ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లోని సిస్టమ్ సరైన గేర్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది, దీనినే గేర్ హంట్ అంటారు, ఈ సిస్టమ్ ఎల్లప్పుడూ సరైన గేర్‌ను గుర్తించలేకపోతుంది. ఫలితంగా ఆటోమేటిక్‌గా గేర్ పడినప్పుడు కారు కొద్దిగా బంప్ అయినట్లు అనిపిస్తుందిస దీనినే షిఫ్ట్ షాక్ అంటారు. ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్‌లోని టెక్నాలజీ వలన ఈ రెండు సమస్యలు ఇందులో ఉండవు.

డ్యూరబిలిటీ (మన్నిక)
ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్‌లో కొన్ని భాగాలు మాత్రమే చలనంలో ఉండటం వలన ఫ్రిక్షన్ (రాపిడి), హీట్ (ఉష్ణం) తగ్గుతుంది. దీని ఫలితంగా ఈ ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్ మన్నిక ఎక్కువగా ఉంటుంది.

లైట్ వెయిట్
రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో పోల్చుకుంటే, ఎక్స్‌ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ 13 శాతం తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఫలితంగా పెర్ఫార్మెన్స్, మైలేజ్ రెండూ పెరుగుతాయి.

స్మూత్, ఎఫీషియెంట్ డ్రైవింగ్
నిస్సాన్ అందిస్తున్న ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్ స్మూత్ షిఫ్టింగ్‌ని కలిగి ఉండి, స్థిరమైన పవర్‌ను డెలివరీ చేస్తుంది. ఫలితంగా ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ స్మూత్‌గా అనిపించడమే కాకుండా ఎఫీషియెంట్‌గాను ఉంటుంది.

శబ్ధం
సాంప్రదాయ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో పోల్చుకుంటే, నిస్సాన్ ఎక్స్‌ట్రానిక్ సివిటి భిన్నంగా ఉంటుంది కాబట్టి, దీని శబ్ధం కూడా భిన్నంగా ఉంటుంది. దీని సౌండింగ్ చాలా హై-టెక్‌గా ఉంటుందని నిస్సాన్ పేర్కొంది.

నిస్సాన్ సివిటిని డ్రైవ్ చేసే విధానం
సివిటి ట్రాన్సిమిషన్ కలిగిన కారును డ్రైవ్ చేసేందుకు సరైన విధానం ఏంటని మేము నిస్సాన్ అధికారులను ప్రశ్నించగా.. గరిష్ట మైలేజ్, పెర్ఫార్మెన్స్ పొందాలంటే యాక్సిలరేటర్‌ను ఓ క్రమ పద్ధతిలో ఉపయోగించాలని వివరించారు.

నిస్సాన్ ఎక్స్‌ట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్ గురించి ఇచ్చిన వివరణ మీకు నచ్చినట్లయితే, నలుగురికి ఉపయోగపడే ఈ కథనాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోగలరు.


Click it and Unblock the Notifications








