అప్‌గ్రేడెడ్ సన్నీ సెడాన్‌ను విడుదల చేయనున్న నిస్సాన్

భారత మార్కెట్లో ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రాను ప్రవేశపెట్టిన జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ'లో కూడా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. 2011 సంవత్సరం చివర్లో నిస్సాన్ ఇండియా తమ సన్నీ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇది భారత్‌లో రెండేళ్లు పూర్తి చేసుకోనుంది.

నిస్సాన్ సన్నీ మార్కెట్లో విడుదలైన సమయంలో దీని సరసమైన ధరక కారణంగా ఇది అనేక మంది కొనుగోలుదారులను ఆకట్టుకుంది. అయితే, మారుతున్న మార్కెట్ వాతావరణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొనుగోలుదారుల అభిరుచి కూడా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా నిస్సాన్ తమ సన్నీ సెడాన్‌ను అప్‌గ్రేడ్ మార్కెట్లో విడుదల చేయనుంది.


అప్‍‌‌గ్రేడెడ్ నిస్సాన్ సన్నీ బేసిక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఫ్రంట్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు, మరింత క్రోమ్ గార్నిష్‌తో ప్రీమియం లుక్ ఇచ్చేలా కాస్మోటిక్ మార్పులు చేయనున్నారు. ఇంటీరియర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌కు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి
నిస్సాన్ సన్నీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (3 పెట్రోల్, 2 డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది). పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ సన్నీలో 1498సీసీ, డిఓహెచ్‌సి 16 వాల్వ్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 99 పిఎస్‌‌ల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన అధునాతన 1.5-లీటర్, 4-సిలిండర్ కె9కె ఇంజన్ 86 పిఎస్‌ల శక్తిని,200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పెట్రోల్ వేరియంట్లో మాత్రమే) సిస్టమ్‌తో లభిస్తాయి.

పెట్రోల్ వెర్షన్ సన్నీ లీటరుకు 16.95 కి. మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం), డీజిల్ వెర్షన్ సన్నీ లీటరుకు 21.64 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు పోటీగా నిలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2013, 15:47 [IST]
English summary
Nissan recently updated its Micra hatchback and gave it a much fresher and more modern appearance. Now, it looks like its saloon compatriot, the Sunny, is also set to get a mid-life update. 2014 Nissan Sunny sedan facelift was spotted in China recently. Here are the first spy images of the same.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+