నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో మరోసారి ఫేస్‌లిఫ్ట్ విడుదల
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇవాలియా ఎమ్‌పివిలో కంపెనీ మరోసారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవలే అప్‌గ్రేడెడ్ సన్నీ సెడాన్‌ను విడుదల చేసిన నిస్సాన్ ఇండియా తాజాగా అప్‌గ్రేడెడ్ ఇవాలియాను మార్కెట్లో విడుదల చేసింది. ఇవాలియా ధరలో ఎలాంటి మార్పు లేకుండా, కొద్దిపాటి డిజైన్ మార్పులతో ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు.
ఇది కూడా చదవండి: 2014 నిస్సాన్ సన్నీ, ధర రూ.6.99 లక్షలు
రీడిజైన్ చేయబడిన 2014 నిస్సాన్ ఇవాలియా ప్రారంభ వేరియంట్ ధర రూ.8.50 లక్షలు గాను మరియు టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.10.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గాను నిర్ణయించారు. ఇక ఇందులో మార్పు విషయానికి వస్తే, ఫ్రంట్ గ్రిల్‌పై వి-షేపులో ఉండే క్రోమ్ స్ట్రిప్ తప్ప బేసిక్ డిజైన్‌లో కానీ ఇతర ఎక్స్టీరియర్లలో కానీ ఎలాంటి మార్పులు లేవు.

ఇంటీరియర్స్‌లో రెండవ వరుసలోని ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్, అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్, ఎయిర్‌బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్స్, కొత్త ఫ్లోర్ మ్యాట్స్, రీడిజైన్డ్ గ్లవ్ బాక్స్, ఫాక్స్ ఉడ్ ప్యానెల్స్ వంటి మార్పులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2014 నిస్సాన్ సన్నీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్
ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇది కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మరికొద్ది రోజుల్లో హోండా మొబిలియో ఎమ్‌పివి మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో నిస్సాన్ తమ ఇవాలియా ఎమ్‌పివిని విడుదల చేయటం గమనార్హం. నిస్సాన్ ఎన్నో ఆశలతో ఎమ్‌పివి సెగ్మెంట్లో ప్రవేశపెట్టిన ఇవాలియా భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా మాదిరిగా విజయం సాధించలేకపోయింది. మరి ఈ అప్‌డేటెడ్ వెర్షన్ వల్లనైనా అమ్మకాలు పెరుగుతాయో లేదో చూడాలి.
ఈ వీడియో చూశారా.. చిన్న పిల్లలకు కూడా హెల్మెట్ ఎందుకు పెట్టాలి?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2qHZi6NhKdM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








