ఇవాలియా ఎమ్‌పివిలో కొత్త ఫీచర్లను జోడించిన నిస్సాన్

By Ravi

నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఇవాలియా ఎమ్‌పివిలో ఫీచర్లను మెరుగుపరచామని కంపెనీ ప్రకటించింది. వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ 7-సీటర్ ఎమ్‌పివి అప్‌గ్రేడ్ చేశామని, వినియోగదారుల సంతృప్తికి కట్టుబడి ఉండే దిశలో భాగంగా ఈ మార్పులు చేర్పులు చేశామని కంపెనీ తెలిపింది.

కొత్త ఇవాలియా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. నిస్సాన్ ఇవాలియాలో ఉపయోగించిన అదే 1.5 లీటర్ డిసిఐ కె9కె డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 85 ‌పిఎస్‌ల శక్తిని, 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ప్రారంభ ధర రూ.8.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇందులోని కొత్త ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియాలో వెనుక స్లైడింగ్ డోర్స్‌పై స్ప్లిట్ ఓపెన్ యూరో విండోస్‌ను కొత్తగా జోడించారు.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

కొత్త ఇవాలియోలోని రెండవ (మధ్య) వరుసలో స్లైడింగ్/రెక్లైనింగ్ కెప్టెన్ సీట్స్‌ను జోడించారు.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

ఇందులో 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (ఇదివరకు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించే వారు) మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

అలాగే, అప్‌గ్రేడెడ్ ఇవాలియా వెనుక వైపు వైపర్, డిఫాగ్గర్‌లను కూడా జోడించారు.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కొత్త యాంటీ-గ్లేర్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ రో అసిస్ట్ గ్రిప్, గ్లవ్ బాక్స్ లిడ్, 2-డిన్ ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కనెక్టివిటీతో) వంటి ఫీచర్లను జోడించారు. ఆప్షనల్‌గా వెనుక సీట్లలోని ప్రయాణికుల కోసం రూఫ్ మౌంటెడ్ ఏసి బ్లోయెప్ యూనిట్‌ను జోడించుకోవచ్చు.

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

నిస్సాన్ ఇవాలియా ధరలు

Nissan Evalia XE: INR 8.78 lakh

Nissan Evalia XE+: INR 9.22 lakh

Nissan Evalia XL: INR 9.80 lakh

Nissan Evalia XL (Option): INR 10.05 lakh

Nissan Evalia XV: INR 10.48 lakh

Nissan Evalia XV (Option): INR 10.73 lakh

అప్‌గ్రేడెడ్ నిస్సాన్ ఇవాలియా ఫీచర్లు

కొత్త నిస్సాన్ ఇవాలియా బ్రిక్ రెడ్, ఆక్వా గ్రీన్, బ్లేడ్ సిల్వర్, ట్విలైట్ గ్రే, ఆంక్సీ బ్లాక్, స్టోర్మ్ వైట్, పెరల్ వైట్ అనే ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 16, 2013, 15:58 [IST]
English summary
Nissan India has announced a host of enhancements in Evalia. Nissan’s 7-seater Multi Utility Vehicle (MUV) will now be available with added convenience features based on customer feedback. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+