నిస్సాన్ టెర్రానో వార్షికోత్సవ ఎడిషన్ విడుదల; ఆన్‌లైన్‌లోనే లభ్యం!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా అందిస్తున్న టెర్రానో ఎస్‌యూవీ, దేశీయ మార్కెట్లో విడుదలై అప్పుడే ఏడాది పూర్తి కావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ నిస్సాన్ టెర్రానోతో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ లిమిటెడ్ ఎడిషన్ టెర్రానో లభ్యం కానుంది.

కేవలం 450 యూనిట్ల నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీలు మాత్రమే కస్టర్లకు అందుబాటులో ఉంటాయని, వీటిని కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా అధీకృత నిస్సాన్ డీలరును సంప్రదించినప్పటికీ, సదరు డీలర్ కూడా ఆన్‌లైన్ ద్వారానే ఈ యానివర్స్‌రే ఎడిషన్ నిస్సాన్ టెర్రానోను బుక్ చేస్తారని కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

నిస్సాన్ టెర్రానో వార్షికోత్సవ ఎడిషన్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌లో లభ్యం కానున్న ఫీచర్లను, దీని ధరను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

వేరియంట్లు

వేరియంట్లు

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. రెండూ కూడా డీజిల్ వేరియంట్లే. అవి -

1. ఎక్స్‌వి డి టిహెచ్‌పి (110 పిఎస్)

2. ఎక్స్‌వి డి టిహెచ్‌పి ప్రీమియం (110 పిఎస్)

స్పోర్టీ బాడీ డెకాల్స్

స్పోర్టీ బాడీ డెకాల్స్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌పై కంపెనీ స్పోర్టీ బాడీ డెకాల్స్‌ను జోడించింది. కారు ముందు బానెట్‌పై బ్లాక్ కలర్ డెకాల్స్ ఆకర్షనీయంగా అనిపిస్తాయి.

రూఫ్ స్పాయిలర్

రూఫ్ స్పాయిలర్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌లో కారు వెనుక భాగంలో బ్లాక్ కలర్ రూఫ్ స్పాయిలర్‌ను ఆఫర్ చేస్తున్నారు. కారు పైభాగాన్ని కూడా బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు.

హెడ్స్ అప్ డిస్‌ప్లే

హెడ్స్ అప్ డిస్‌ప్లే

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌లో హెడ్స్ అప్ డిస్‌ప్లేను ఆఫర్ చేస్తున్నారు. ఇది డైరెక్షన్స్, స్పీడ్, టైమ్ మొదలైన సమాచారాన్ని గ్లాస్ డిస్‌ప్లేపై ప్రొజెక్ట్ చేస్తుంది.

క్రోమ్ డోర్ హ్యాండిల్స్

క్రోమ్ డోర్ హ్యాండిల్స్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌లోని క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తాయి.

సైడ్ స్టెప్

సైడ్ స్టెప్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్‌లో సైడ్ డోర్స్ క్రింది భాగంలో ఆదనపు సైడ్ స్టెప్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్‌ని ఇవ్వటమే కాకుండా, సులువుగా కారు లోనికి/వెలుపలకు ప్రవేశించేందుకుగా వీలుగా ఉంటుంది.

టెయిల్ ఎంట్రీ గార్డ్

టెయిల్ ఎంట్రీ గార్డ్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ వెనుక వైపు డోర్ క్రింది భాగంలో క్రోమ్ గార్నిష్‌తో కూడిన టెయిల్ ఎంట్రీ గార్డ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది రియర్ బంపర్‌కు ప్రొటెక్షన్‌గా నిలువడమే కాకుండా, స్టయిలిష్‌గా ఉంటుంది.

యానివర్స్‌రే ఎడిషన్‌ బ్యాడ్జింగ్

యానివర్స్‌రే ఎడిషన్‌ బ్యాడ్జింగ్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ ప్రత్యేకతను, ఎక్స్‌క్లూజివిటీని తెలియజేసేందుకు వీలుగా దీని వెనుక భాగంలో యానివర్స్‌రే ఎడిషన్‌ బ్యాడ్జింగ్‌ను ప్రధానంగా కనిపించేలా అమర్చారు.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్, ఫైర్ రెడ్, స్టెర్లింగ్ గ్రే, స్టోర్మ్ వైట్ టూ పెరల్ వైట్ అనే ఐదు రంగులలో లభిస్తుంది.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ ఎక్స్‌వి డి టిహెచ్‌పి వేరియంట్లో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టమెంట్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ షిఫ్ట్ నాబ్ ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఎక్స్‌వి డి టిహెచ్‌పి ప్రీమియం వేరియంట్లో లెథర్ సీట్స్, ఫ్రంట్ అండ్ రియర్ డోర్ ఆర్మ్‌రెస్ట్స్‌పై జీబ్రా వుడ్ ఫినిష్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.

ధరలు

ధరలు

నిస్సాన్ టెర్రానో యానివర్స్‌రే ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

1. ఎక్స్‌వి డి టిహెచ్‌పి (110 పిఎస్) - రూ.12.38 లక్షలు

2. ఎక్స్‌వి డి టిహెచ్‌పి ప్రీమియం (110 పిఎస్) - రూ.13.13 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్

ఇంజన్

ఇంజన్ పరంగా నిస్సాన్ టెర్రానో వార్షికోత్సవ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ 110 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 10, 2014, 10:07 [IST]
English summary
Nissan India has launched the Terrano Anniversary Edition and it will be available via its official website only. Only 450 units of Nissan Terrano Anniversary Edition will be sold.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+