నిస్సాన్ మైక్రా యాక్టివ్ కాంపిటీటర్స్, ధరలు
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా అందిస్తున్న మైక్రాలో ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్ (మైక్రా యాక్టివ్)ను కేవలం రూ.3.50 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దీని ధరను తక్కువగా ఉంచేందుకు గాను డిజైన్, ఫీచర్లలో పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా సరసమైన ధరకే నిస్సాన్ మైక్రా యాక్టివ్ వేరియంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది.
నిస్సాన్ మైక్రా యాక్టివ్ మొత్తం నాలు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి సేఫ్టీ) లభిస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. పాతన మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే యాక్టివ్ వేరియంట్‌లో కూడా ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు.
పాత మైక్రాతో పోల్చుకుంటే ఈ కొత్త మైక్రా యాక్టివ్ దాదాపు 30 కేజీల తక్కువ బరువును కలిగి ఉండి, లీటరుకు 19.49 కి.మీ. మైలేజీని అందిస్తుంది. కొత్త బంపర్ (ఫాగ్ లైట్లు లేవు, వాటి స్థానంలో ఎయిర్ వెంట్లను జోడించారు), అదే పాత గ్రిల్ (క్రోమ్ లైనింగ్ లేదు)తో ఇది ఆర్డనరీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మారుతి ఆల్టో కె10, వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10, చెర్లే బీట్, చెవర్లే స్పార్క్, ఫోర్డ్ ఫిగో వంటి చిన్న కార్లతో పోటీ పడుతుంది. మరి ఈ మోడళ్ల ధరలతో మైక్రా యాక్టివ్ ధరలను పోల్చి చూద్దాం రండి..!

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.50 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.4.71 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మారుతి సుజుకి ఆల్టో కె10 ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.21 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.3.38 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే స్పార్క్ 1.0 ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.33 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.3.89 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.57 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.4.48 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యుందాయ్ ఐ10 1.1 ఐఆర్‌డిఈ ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.75లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.4.27 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే బీట్ 1.2 ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.87 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.5.14 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఫిగో 1.2 ధరలు
ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర - రూ.3.89 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ ధర - రూ.5.07 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








