నిస్సాన్ మైక్రాలో బేస్ డీజిల్ వేరియంట్ విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల అప్‌గ్రేడెడ్ 2013 నిస్సాన్ మైక్రా డీజిల్ వెర్షన్‌లో మరొక ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో మైక్రా ఎక్స్ఈ (Micra XE) వేరియంట్ పేరుతో విడుదలైన దీని ధర రూ.5.57 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఎక్స్ఈ వేరియంట్ విడుదలతో మైక్రాలో లభ్యం కానున్న మొత్తం వేరియంట్ల సంఖ్యకు 12కు చేరుకుంది.

నిస్సాన్ మైక్రా డీజిల్ ఎక్స్ఈ వేరియంట్లో క్రోమ్ ప్లేటెడ్ రేడియేటర్ గ్రిల్, టిల్ట్ స్టీరింగ్, డ్రైవ్ కంప్యూటర్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటుగా ఇంజన్ ఇమ్మొబిలైజర్, జ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ ఇండికేటర్, డోర్అజర్ వార్నింగ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ లెవల్ వార్నింగ్ ఇండికేటర్, హెడ్‌లైట్ ఆన్ వార్నింగ్ ఇండికేటర్, కీ రిమూవ్ వార్నింగ్ ఇండికేటర్ మొదలైనవి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా లభ్యం కానున్నాయి.


ఫోర్త్ జనరేషన్ సిటీ కారును ఆధారంగా చేసుకొని ఈ ఎంట్రీ లెవల్ మైక్రా కారును అభివృద్ధి చేశారు. రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్స్, రిఫ్రెష్ చేయబడిన ఇంటీరియర్స్‌తో అధునాతన సాంకేతిక ఫీచర్లో ఇది లభిస్తుంది. ఈ వేరియంట్‌లో డీజిల్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని డీజిల్ ఇంజన్ లీటరుకు 23.08 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త మైక్రా ఎక్స్ఈ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (ఆలివ్ గ్రీన్, టార్క్వాయిస్ బ్లూ, బ్లేడ్ సిల్వర్, స్టోర్మ్ వైట్, ఆంక్సీ బ్లాక్, బ్రిక్ రెడ్ కలర్లలో లభ్యమవుతుంది. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించగల ఈ కారులో విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉంటుంది. ఇది 2 ఏళ్లు లేదా 50,000 కి.మీ. (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

Nissan Micra Interior

Article Published On: Wednesday, September 4, 2013, 17:00 [IST]
English summary
Following the successful commercial launch of the premium ‘New Micra’ compact hatchback range, Nissan today announced the launch of the new diesel-powered Micra XE variant. Sales of the new diesel-powered Micra entry level variant will commence from September 4, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+