యూకేలో నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ అందిస్తున్న పాపులర్ గ్లోబల్ స్మాల్ కార్ 'మైక్రా' (గ్లోబర్ మార్కెట్లలో 'మార్చ్' పేరుతో అమ్ముడవుతోంది)లో కంపెనీ ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. రెగ్యులర్ నిస్సాన్ మైక్రా కన్నా భిన్నంగా ఉండేలా కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను తీర్చిదిద్దింది.

డ్యూయెల్ కలర్ ఎక్స్టీరియర్స్ (రూఫ్, సైడ్స్‌పై విభిన్నమైన కలర్ పెయింటింగ్)‌తో ఇది ఫస్ట్ లుక్‌లోనే కస్టమర్లను ఆకట్టుకుంటుంది. నిస్సాన్ యూకే ఈ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ నిస్సాన్ మైక్రాను అక్కడి మార్కెట్లో విడుదల చేసింది.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

నిస్సాన్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ వెర్షన్ అప్‌గ్రేడెడ్ నిస్సాన్ మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను తయారు చేసింది.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

ఇది కాంట్రాస్టింగ్ రూఫ్ సైడ్ మిర్రర్స్‌తో మూడు విభిన్న కలర్ కాంబినేషన్లలో లభిస్తుంది. అవి పసిఫిక్ బ్లూ విత్ వైట్ రూఫ్/మిర్రర్ క్యాప్స్, షిరాజ్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్/మిర్రర్ క్యాప్స్, ఆల్బాస్టర్ వైట్ విత్ రెడ్ రూఫ్/మిర్రర్ క్యాప్స్. ఈ కాంట్రాస్టింగ్ కలర్‌ను సైడ్ సిల్స్ మరియు సెంటర్ క్యాప్స్‌పై కూడా అప్లయ్ చేస్తారు.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

ఈ కలర్ కాంబినేషన్ కేవలం ఎక్స్టీరియర్లకు మాత్రమే పరిమితం కాదు. ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, గేర్ లివర్ కాలమ్ లోవర్ పార్ట్, ఫ్లోర్ మ్యాట్స్ కూడా అదే కాంట్రాస్టింగ్ కలర్లతో లభిస్తాయి. చివరిగా ఇందులో లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ మరియు క్రోమ్ టిప్డ్ ఎగ్జాస్ట్ పైప్స్ ఇందులో మరో ప్రత్యేకతగా నిలుస్తాయి.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

యూకే మార్కెట్లో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ నిస్సాన్ మైక్రాలో యాంత్రికపరమైన మార్పులేవీ లేవు. అక్కడి మార్కెట్లో అమ్ముడయ్యే నిస్సాన్ మైక్రా అసెంటా వేరియంట్‌లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రూప్ స్పాయిలర్‌ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

మైక్రా లిమిటెడ్ ఎడిషన్ ధర 12300 పౌండ్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.12.66 లక్షలు).

నిస్సాన్ మైక్రా లిమిటెడ్ ఎడిషన్

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యూకే మార్కెట్లో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్ నిస్సాన్ మైక్రా మనదేశంలో తయారైనదే. చెన్నైలోని ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ప్లాంటులో ఈ కారును తయారు చేసి, యూకే మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 11:08 [IST]
English summary
Nissan UK has now come out with a limited edition of the Micra in that country. The highlight of the limited edition is its contrasting roof colour and this simple implementation of dual colour brings in a drastic change in the characteristics of the Micra as you can see for yourself in the images below.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+