భారత్‌కు రానున్న పెర్ఫామెన్స్ వెర్షన్ నిస్సాన్ మైక్రా నిస్మో
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో తమ మైక్రా బ్రాండ్‌ను మరింత విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవలే మైక్రాలో బడ్జెట్ వెర్షన్‌ను, ప్రీమియం వెర్షన్‌ను ప్రవేశపెట్టిన నిస్సాన్ ఇప్పుడు ఇందులో స్పోర్టీ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుసు యోచిస్తోంది. నిస్సాన్‌కు చెందిన మోటార్‌స్పోర్ట్ అండ్ పెర్ఫామెన్స్ డివిజన్ 'నిస్మో' (Nismo) అభివృద్ధి చేసిన ఓ సరికొత్త మైక్రాను కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది.
ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రాను విడుదల చేసిన ఇప్పుడు తాజాగా 'నిస్సాన్ నిస్మో మైక్రా' (Nissan Nismo Micra) ఫొటోలను విడుదల చేసింది. మైక్రా జపాన్ మార్కెట్లో మార్చ్ పేరుతో అమ్ముడవుతోంది. 2013 నిస్సాన్ మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త పెర్ఫామెన్స్ వెర్షన్ నిస్మో మైక్రాను తయారు చేశారు. ఇది స్పోర్టీ ఎక్ట్సీరియరస్స్, స్పోర్టీ ఇంటీరియర్లను కలిగి ఉంటుంది మంచి స్పోర్టీ ఫీల్ రైడ్‌ను ఇస్తుంది.
కొత్త బంపర్స్, సైడ్ స్కర్ట్స్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, నిస్మో బ్యాడ్జ్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు సైడ్ స్కర్ట్స్ క్రింది భాగంలో డిజైన్ చేసిన రెడ్ లైన్స్ మరియు రెడ్ అవుట్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ గ్రిల్‌పై నిస్మో బ్యాడ్జ్, కొత్త సైలెన్సర్ వంటి అనేక స్పోర్టీ ఎక్స్టీరియర్ మార్పులను ఈ కొత్త నిస్మో మైక్రాలో చూడొచ్చు. అలాగే ఇంటీరియర్లలో కూడా నిస్మో డిఎన్ఏ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంజన్ పరంగా పరంగా ఈ కారులో మార్పులు ఉండనున్నాయి.
స్పోర్టీ రైడ్ కోసం ఈ ఇంజన్ పెర్ఫామెన్స్‌ను పెంచారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్టీ నిస్సాన్ నిస్మో మైక్రా పెర్ఫామెన్స్ వెర్షన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు నిస్సాన్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి 9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

నిస్సాన్ మైక్రా నిస్మో
నిస్సాన్‌కు చెందిన మోటార్‌స్పోర్ట్ అండ్ పెర్ఫామెన్స్ డివిజన్ 'నిస్మో' (Nismo) అభివృద్ధి చేసిన ఓ సరికొత్త మైక్రా నిస్మోను భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

నిస్సాన్ మైక్రా నిస్మో
స్పోర్టీ వెర్షన్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని, స్పోర్టీ ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్స్‌తో కూడిన నిస్సాన్ మైక్రా నిస్మోను కంపెనీ అభివృద్ధి చేసింది.

నిస్సాన్ మైక్రా నిస్మో
సరికొత్త బంపర్స్, సైడ్ స్కర్ట్స్, నిస్మో బ్యాడ్జ్, నిస్మో స్టయిల్ ఎక్స్టీరియర్స్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను ఈ నిస్మో మైక్రాలో గమనించవచ్చు.

నిస్సాన్ మైక్రా నిస్మో
స్పోర్టీ ఇంటీరియర్స్‌ను ఈ చిత్రంలో చూడొచ్చు.

నిస్సాన్ మైక్రా నిస్మో
కంఫర్టబల్ రైడ్ కోసం సౌకర్యవంతమైన సీట్స్

నిస్సాన్ మైక్రా నిస్మో
స్టయిలిష్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్ లను ఇందులో గమనించవచ్చు.

నిస్సాన్ మైక్రా నిస్మో
నిస్మో బ్రాండింగ్ మీటర్ కన్సోల్

నిస్సాన్ మైక్రా నిస్మో
స్పోర్టీ రైడ్ కోసం ఈ ఇంజన్ పెర్ఫామెన్స్‌ను పెంచారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ మైక్రా నిస్మో
భారత మార్కెట్లో ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి 9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








