నిస్సాన్-మిత్సుబిషిల మినీకారు విడుదల

By Ravi

చిన్న కారును అభివృద్ధి చేయటానికి ఒకే దేశానికి చెందిన రెండు కార్ కంపెనీలు చేతులు కలిపితే ఏం జరుగుతుంది..? ఇదిగో ఈ ఫోటోల్లో కనిపిస్తున్నట్లుగానే అద్భుతమైన కార్లు ఆవిష్కారం అవుతాయి. జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజాలు నిస్సాన్, మిత్సుబిషిలు సంయుక్తంగా ఓ చిన్న కారును అభివృద్ధి చేశాయి. ఈ కారును ఇరు కంపెనీలు వేర్వేరుగా తమ స్వంత బ్రాండింగ్‌తో మార్కెటింగ్ చేయనున్నాయి.

నిస్సాన్ వెర్షన్ చిన్న కారుకు 'డేజ్' (Dayz) అని, మిత్సుబిషి వెర్షన్ చిన్న కారుకు 'ఈకె' (eK) అనే పేర్లను పెట్టారు. ఈ రెండు కంపెనీలు కూడా తమ చిన్న కార్లను రెండు వేరియంట్లలో అందించనున్నారు. నిస్సాన్ డేజ్, నిస్సాన్ డేజ్ హైవే స్టార్ మరియు మిత్సుబిషి ఈకె వ్యాగన్, మిత్సుబిషి ఈకె కస్టమ్ అని పిలిచే ఈ కాంపాక్ట్ కార్లను తయారు చేసేందుకు ఇరు కంపెనీలు 2010లో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

జపనీస్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా చిన్న కార్లను డిజైన్ చేసి నిర్మించాలన్న ప్రయోజనం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. ఇరు సంస్థల నుంచి ఈ చిన్న కారు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు రానున్నాయి. 2014 నాటికి ఓ పెద్ద పొడవాటి సూపర్ హైట్ వ్యాగన్‌ను ప్రవేశపెట్టాలని నిస్సాన్-మిత్సుబిషి కంపెనీలు భావిస్తున్నాయి. కాగా.. ఈ చిన్న కారు ధరను మాత్రం కంపెనీ నిర్ణయించలేదు. అయితే, వీటిని ప్రత్యేకంగా జపనీస్ మార్కెట్ల కోసం డిజైన్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఇవి భారత్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

నిస్సాన్ డేజ్

నిస్సాన్ డేజ్

నిస్సాన్ డేజ్ హైవే స్టార్

నిస్సాన్ డేజ్ హైవే స్టార్

మిత్సుబిషి ఈకే వ్యాగన్

మిత్సుబిషి ఈకే వ్యాగన్

మిత్సుబిషి ఈకే కస్టమ్

మిత్సుబిషి ఈకే కస్టమ్

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2013, 6:49 [IST]
English summary
Nissan and Mitsubishi, both Japanese automobile manufacturers have come out with a new minivan product, which has been jointly developed by them. The collaboration is a result of a deal signed in 2010 under which the two companies had agreed to jointly develop several new models over the years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+