నిస్సాన్ మైక్రా ప్లాట్‌ఫామ్‌పై కాంపాక్ట్ సెడాన్!

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లోని కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి ప్రవేశించేందుకు నిస్సాన్ ఇండియా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే మారుతి సుజుకి (స్విఫ్ట్ డిజైర్), హోండా కార్స్ (అమేజ్) కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి సక్సెస్‌ను సాధిస్తే, తాజాగా టాటా మోటార్స్ (జెస్ట్), ఫోర్డ్ ఇండియా (ఫిగో సిఎస్), హ్యుందాయ్ (ఎక్సెంట్) కంపెనీలు తమ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఇటీవలే ముగిసిన ఆటో ఎక్స్‌పో 2014 ఆవిష్కరించాయి.

కాగా.. ఈ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో పెరుగుతున్న అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు నిస్సాన్ కూడా సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, నిస్సాన్ మైక్రా కాంపాక్ట్ సెడాన్ రెండరింగ్ ఫొటోలు కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఆ రెండరింగ్ ఫొటోలను చూడండి.


ప్రస్తుతానికి ఈ నిస్సాన్ మైక్రా కాంపాక్ట్ సెడాన్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అలాగే, ఈ సమయంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా అందుబాటులో లేవు.

ఇదిలా ఉండగా.. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ 'ర్యాపిడ్' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం.

Nissan Micra

కాంపాక్ట్ సెడాన్లపై కార్ మేకర్లకు ఎందుకంత క్రేజ్..?
కారు మొత్తం పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉండి, ఇంజన్ సామర్థ్యం 1500సీసీ (1.5 లీటర్) కన్నా తక్కువగా ఉంటే, సదరు కారును కాంపాక్ట్ కారుగా పరిగణించి, అధిక ఎక్సైజ్ సుంకం విధించడం నుంచి మినహాయించడం జరుగుతుంది. ఇలాంటి కార్లపై 12 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు. అదే పెద్ద కార్లపై అయితే (4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు, 1500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం) ఇందుకు రెట్టింపులో ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరుగుతుంది. ఫలితంగా కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, సరసమైన ధరకే వీటిని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే, ఇప్పుడు కార్ మేకర్లంతా కాంపాక్ట్ సెడాన్ కార్ల తయారీపై దృష్టి సారిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, February 14, 2014, 15:23 [IST]
English summary
Nissan India is planing to make sub-4 meter compact sedan based on its best selling small car Micra. Here is the few rendering photos of Micra Compact Sedan from theophiluschin.com.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+