నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ ఇదే; ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న చీప్ అండ్ బెస్ట్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ'లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. అయితే, తాజా సమాచారం ప్రకారం, నిస్సాన్ ఇప్పటికే అమ 2014 సన్నీ సెడాన్‌ను థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది.

థాయ్‌లాండ్ మార్కెట్లో నిస్సాన్ సన్నీ సెడాన్, నిస్సాన్ అల్మెరా పేరుతో అమ్ముడవుతోంది. ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నిస్సాన్ ఇటీవలే అక్కడి మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. నిస్సాన్ ఇండియా తమ అప్‌గ్రేడెడ్ సన్నీ సెడాన్‌ను 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేస్తామని ఆధికారికంగా ధృవీకరించిన సంగతి తెలిసినదే. థాయ్‌లాండ్ నిస్సాన్ అల్మెరాకు, ఇండియన్ వెర్షన్ సన్నీ సెడాన్‌కు పేరులో తప్ప ఫీచర్లలో కానీ, డిజైన్ పరంగా కానీ, యాంత్రిక పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు.

మరి ఈ 2014 నిస్సాన్ సన్నీ సెడాన్‌లోని ఆ హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్‌లోని ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ కొత్తగా రీడిజైన్ చేశారు. ఇది కంపెనీ అందిస్తున్న పెద్ద సెడాన్స్ అల్టిమా, సిల్ఫీలను పోలి ఉంటుంది. అలాగే క్రింది భాగంలో క్రోమ్ హైలైటింగ్ మరియు కొత్త ఫాగ్‌ల్యాంప్స్‌ను ఇందులో గమనించవచ్చు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. అయితే, ఇందులో కొత్తగా 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

కొత్త నిస్సాన్ వెనుక డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్తగా జోడించిన బూట్ డోర్ మౌంటెడ్ రియర్ రూఫ్ స్పాయిలర్‌లను ఇందులో చూడొచ్చు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్స్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌ను, డ్యాష్ బోర్డును రీడిజైన్ చేశారు. పియానో బ్లాక్ కలర్ క్లస్టర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్టీరింగ్ వీల్‌ను కూడా రీడిజైన్ చేశారు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

ఇందులో 2-డిన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. కొత్తగా ఇందులో 6.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ డివిడి ప్లేయర్‌ను ఆఫర్ చేస్తున్నారు (ఇండియన్ వెర్షన్‌లో ఈ ఫీచర్ ఉండకపోవచ్చని అంచనా).

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

థాయ్‌లాండ్ మార్కెట్లో కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ ధరలు 4,33,000 బాట్స్ నుంచి 5,99,000 బాట్స్ మధ్యలో ఉన్నాయి. (మన కరెన్సీలో సుమారు రూ.8.3 లక్షల నుంచి రూ.11.66 లక్షలు).

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2014, 16:17 [IST]
English summary
Nissan has launched Sunny facelift in Thailand market with cosmetic updates. Nissan India earlier confirmed that the Sunny facelift would be brought to the Auto Expo 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+