ఆగస్ట్ 2014 నాటికి నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ విడుదల
గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ ఇండియా ఆవిష్కరించిన నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది ఆగస్ట్ నెల నాటికి మార్కెట్లోకి రానుంది. మొదట్లో విశాలమైన స్పేస్, సరసమైన ధరతో కొనుగోలుదారులను ఆకర్షించిన నిస్సాన్ సన్నీ, ఇప్పుడు క్రమంగా తన హవాను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో, కాస్తంత మోడ్రన్ టచ్ కలిగిన రిఫ్రెష్డ్ సన్నీని కస్టమర్లకు పరిచయం చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సన్నీ సెడాన్‌ను అల్మెరా పేరిట నిస్సాన్ థాయ్‌లాండ్ మార్కెట్లో ఇదివరకే విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ ఫేస్‌లిఫ్ట్ సన్నీ సెడాన్ గడచిన ఆటో ఎక్స్‌పో ద్వారా కంపెనీ ఇండియన్ మార్కెట్‌కు కూడా పరిచయం చేసింది. వీలైనంత త్వరగా ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో విడుల చేసి, తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
కొత్త 2014 నిస్సాన్ సన్నీలో అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. అయితే, యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్‌లోని ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొత్తగా రీడిజైన్ చేశారు. ఇది కంపెనీ అందిస్తున్న పెద్ద సెడాన్స్ అల్టిమా, సిల్ఫీలను పోలి ఉంటుంది. అలాగే క్రింది భాగంలో క్రోమ్ హైలైటింగ్ మరియు కొత్త ఫాగ్‌ల్యాంప్స్‌ను ఇందులో గమనించవచ్చు.

సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. అయితే, ఇందులో కొత్తగా 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

కొత్త నిస్సాన్ వెనుక డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్తగా జోడించిన బూట్ డోర్ మౌంటెడ్ రియర్ రూఫ్ స్పాయిలర్‌లను ఇందులో చూడొచ్చు.

ఇంటీరియర్స్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌ను, డ్యాష్ బోర్డును రీడిజైన్ చేశారు. పియానో బ్లాక్ కలర్ క్లస్టర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్టీరింగ్ వీల్‌ను కూడా రీడిజైన్ చేశారు.

యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.

లేటెెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








