ఆటో ఎక్స్‌పో 2014: నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ'లో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ అప్‌గ్రేడెడ్ సన్నీ కారును ఆవిష్కరించింది.
కొత్త నిస్సాన్ సన్నీలో అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. అయితే, యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.
నిస్సాన్ ఇప్పటికే అమ 2014 సన్నీ సెడాన్‌ను థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. థాయ్‌లాండ్ మార్కెట్లో నిస్సాన్ సన్నీ సెడాన్, నిస్సాన్ అల్మెరా పేరుతో అమ్ముడవుతోంది. థాయ్‌లాండ్ నిస్సాన్ అల్మెరాకు, ఇండియన్ వెర్షన్ సన్నీ సెడాన్‌కు పేరులో తప్ప ఫీచర్లలో కానీ, డిజైన్ పరంగా కానీ, యాంత్రిక పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు.
కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ ఫొటోలను, వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్‌లోని ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొత్తగా రీడిజైన్ చేశారు. ఇది కంపెనీ అందిస్తున్న పెద్ద సెడాన్స్ అల్టిమా, సిల్ఫీలను పోలి ఉంటుంది. అలాగే క్రింది భాగంలో క్రోమ్ హైలైటింగ్ మరియు కొత్త ఫాగ్‌ల్యాంప్స్‌ను ఇందులో గమనించవచ్చు.

సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. అయితే, ఇందులో కొత్తగా 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

కొత్త నిస్సాన్ వెనుక డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్తగా జోడించిన బూట్ డోర్ మౌంటెడ్ రియర్ రూఫ్ స్పాయిలర్‌లను ఇందులో చూడొచ్చు.

ఇంటీరియర్స్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌ను, డ్యాష్ బోర్డును రీడిజైన్ చేశారు. పియానో బ్లాక్ కలర్ క్లస్టర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్టీరింగ్ వీల్‌ను కూడా రీడిజైన్ చేశారు.

యాంత్రిక పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








