డిసి డిజైన్స్ నుంచి నిస్సాన్ సన్నీ లాంజ్ ప్యాకేజ్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు ఇంటీరియర్‌ను చూసి ఇదేదో ఫారిన్ లగ్జరీ కారు అనుకుంటే మీరు బ్రేకుపై కాలేసినట్లే. ఇది నిస్సాన్ ఇండియా అందిస్తున్న మేడ్ ఇన్ ఇండియా చీప్ అండ్ బెస్ట్ 'సన్నీ సెడాన్' మరి ఈ కొత్త అవతారమేంటా అని అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన భారతీయ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ మోడిఫై చేసిన డిసి సన్నీ సెడాన్ ఇది.
వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను అద్భుతమైన రీతిలో కస్టమైజ్ చేయటంలో చేయి తిరిగిన ప్రముఖ ఆటోమోటివ్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ నిస్సాన్ సన్నీ సెడాన్ ఇంటీరియర్‌ను ఇలా లగ్జరీ లాంజ్‌లా మార్చేసింది. ఇటీవలే రెనో డస్టర్ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసి ప్రీమియం లుక్ కల్పించిన డిసి డిజైన్స్ తాజాగా నిస్సాన్ సన్నీ సెడాన్ ఇంటీరియర్‌ను ఇలా కస్టమైజ్ చేసింది.
విలాసవంతమైన ప్రీమియం లెథర్ సీట్లు, రెడ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్, అక్కడక్కడా వుడ్ ఫినిషింగ్, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల వినోదం కోసం ఫ్రంట్ సీట్‌కు (డ్రైవర్ సీట్‌కు వెనుక భాగంలో) ఏర్పాటు చేసిన ఎల్‌సిడి స్క్రీన్, ఐప్యాడ్, ఆటోమేటిక్ సీట్స్, ల్యాప్‌టాప్/ఫుడ్ ట్రే, కప్ హోల్డర్స్, సెంటర్ కన్సోల్‌పై స్టోరేజ్ స్పేస్, డ్యాష్‌బోర్డ్‌కు ఏర్పాటు చేసిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక లగ్జరీ ఫీచర్లను ఈ మోడిఫైడ్ నిస్సాన్ సన్నీలో చూడొచ్చు.
డిసి డిజైన్స్ సంస్థ ఇప్పటికే టాటా ఆరియా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా వింగర్, హిందుస్థాన్ అంబాసిడర్, అశోక్ లేలాండ్ బస్ వంటి అనేక వాహనాలను కస్టమైజ్ చేసింది.

కస్టమైజ్డ్ నిస్సాన్ సన్నీ ఇంటీరియర్స్

విలాసవంతమైన వెనుక సీట్లు

వెనుక సీట్‌లో ప్యాసింజర్ల వినోదం కోసం

వెనుక సీట్‌లో సెంటర్ కన్సోల్

ల్యాప్‌టాప్/ఫుడ్ ట్రే

ఫోల్డబిల్ ఫ్రంట్ సీట్స్



Click it and Unblock the Notifications








