సన్నీలో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన నిస్సాన్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సన్నీలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ సన్నీ సెడాన్ కన్నా మరిన్ని అదనపు ప్రీమియం ఫీచర్లు ఉండేలా కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ సన్నీ సెడాన్‌ను తీర్చిదిద్దింది. ఫిబ్రవరి 12వ తేది నుండి ఈ స్పెషల్ ఎడిషన్ సన్నీ సెడాన్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీలో కంపెనీ ఆఫర్ చేస్తున్న స్పెషల్ ఫీచర్ల వివరాలు ఉన్నాయి:
* వెనుక వైపు డోర్‌పై క్రోమ్ కోటింగ్ మరియు బూట్ డోర్‌పై అమర్చిన రూఫ్ స్పాయిలర్
* రియర్ పార్కింగ్ కెమెరా
* ప్రీమియం లెథర్ సీట్స్
* బ్లూటూత్, ఆక్స్-ఇన్, డివిడి, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మల్టీమీడియా టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్
స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీలో యాంత్రిక పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. నిస్సాన్ సన్నీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (3 పెట్రోల్, 2 డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది). పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ సన్నీలో 1498సీసీ, డిఓహెచ్‌సి 16 వాల్వ్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన అధునాతన 1.5-లీటర్, 4-సిలిండర్ కె9కె ఇంజన్ 86 పిఎస్‌ల శక్తిని,200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇవి రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
పెట్రోల్ వెర్షన్ సన్నీ లీటరుకు 16.95 కి. మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం), డీజిల్ వెర్షన్ సన్నీ లీటరుకు 21.64 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు పోటీగా నిలుస్తోంది. నిస్సాన్ సన్నీలో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభిస్తాయి.
దేశీయ విపణిలో నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్ ధరలు ఇలా ఉన్నాయి:
* స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.8.60 లక్షలు
* స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (డీజిల్) - రూ.9.68 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సన్నీలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
ప్రస్తుతం లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ సన్నీ సెడాన్ కన్నా మరిన్ని అదనపు ప్రీమియం ఫీచర్లు ఉండేలా కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ సన్నీ సెడాన్‌ను తీర్చిదిద్దింది.

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
* వెనుక వైపు డోర్‌పై క్రోమ్ కోటింగ్ మరియు బూట్ డోర్‌పై అమర్చిన రూఫ్ స్పాయిలర్

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
* రియర్ పార్కింగ్ కెమెరా

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
* ప్రీమియం లెథర్ సీట్స్

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
* బ్లూటూత్, ఆక్స్-ఇన్, డివిడి, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మల్టీమీడియా టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్

నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్
దేశీయ విపణిలో నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్ ధరలు ఇలా ఉన్నాయి:
* స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.8.60 లక్షలు
* స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (డీజిల్) - రూ.9.68 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








