అనధికారికంగా నిస్సాన్ టెర్రానో బుకింగ్స్ ప్రారంభం!?
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా ఈనెల 20వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించిన 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano) కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం అధికారికంగా సెప్టెంబర్ 1, 2013వ తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభిస్తామని, ఈ ఎస్‌యూవీ ఆవిష్కరణ సమయంలో కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసినదే.
అయితే, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే కొందరు నిస్సాన్ అధీకృత డీలర్లు టెర్రానో ఎస్‌యూవీ కోసం అనధికారికంగా బుకింగ్‍లను అంగీకరిస్తున్న తెలుస్తోంది. బుకింగ్ కోసం కస్టమర్ల నుంచి దాదాపు రూ.50,000 నుంచి రూ.1 లక్ష మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరిస్తున్నట్లు సమాచారం. నిస్సాన్ టెర్రానో అక్టోబర్ 2013 నెల నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది.

నిస్సాన్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిభింభింపజేసే 'డబుల్ లేయర్ హెరిటేజ్ గ్రిల్' (నిస్సాన్ ఎక్స్-ట్రైల్, పాత్‌ఫైండర్, పాట్రోల్ వంటి మోడళ్లలో కనిపించే గ్రిల్ మాదిరిగా), కొత్త హెడ్‌లైట్స్ టెర్రానోలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయు. టెర్రానోలోని పెద్ద బంపర్లు, ఫెండర్ల వలన ఇది రెనో డస్టర్ కన్నా పొడవుగా అనిపిస్తుంది. ఇందులో బాడీ కలర్ రూఫ్ రెయిల్స్ మరొక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

అయితే, ఇందులోని బి, సి పిల్లర్స్ మాత్రం నలుపు రంగులో ఉంటాయి. 16 ఇంచ్ మెషీన్ పాలిష్డ్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ (సగం బూట్ డోరుపై, సగం బాడీపై ఉంటుంది) ఫీచర్లు కూడా చెప్పుకోదగినవి. నిస్సాన్ టెర్రానో బ్రాంజ్ గ్రే, పెరల్ వైట్, సఫైర్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, ఫైర్ రెడ్, స్టెర్లింగ్ గ్రే వంటి కలర్లలో ఇది లభ్యం కానుంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, బేసిక్ ఇంటీరియర్ డిజైన్‌ను మాత్రం అలానే ఉంచారు. డోర్ల లోపలి వైపు ఫాక్స్ ఉడ్ డోర్ హ్యాండిల్స్, డ్యాష్ బోర్డుపై మధ్యలో ఏర్పాటు చేసిన ఎయిర్ వెంట్స్, అక్కడక్కడా ఉడ్ అండ్ క్రోమ్ గార్నిష్, రీడిజై చేసిన స్టీరింగ్ వీల్ ఇందులో సరికొత్త ఫీచర్లు. ఇంజన్స్ విషయానికి వస్తే, రెనో డస్టర్‌లో ఉపయోగించిన ఇంజన్లనే (1.6 లీటర్ పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్లు) నిస్సాన్ టెర్రానోలోను ఉపయోగించనున్నారు.


Click it and Unblock the Notifications








