అఫీషియల్: ఆగస్ట్ 20న విడుదల అవుతున్న టెర్రానో

By Ravi

కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులకు మరొక గుడ్ న్యూస్. రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని నిస్సాన్ ఇండియా అభివృద్ధి చేసిన 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano) కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈనెలలో మార్కెట్లో విడుదల కానుంది.

ఆగస్ట్ 20, 2013వ తేదీన తమ టెర్రానో ఎస్‌యూవీని విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే తమ టెర్రానో కాంపాక్ట్‌ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్ ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసినదే.


భారత మార్కెట్లో నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న రెనో డస్టర్ బేస్ డీజిల్ వేరియంట్ (ఆర్ఎక్స్ఈ) ధర రూ.8.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీని రెనో డస్టర్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేసినప్పటికీ, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇది డస్టర్ కన్నా పూర్తిగా భిన్నంగా ఉండనుంది. నిస్సాన్ టెర్రానో కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.


డీజిల్ వెర్షన్‌ నిస్సాన్ టెర్రానోలో నిస్సాన్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచాం. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు సంబందించిన మరింత సమాచారం తెలియాలంటే ఆగస్ట్ 20 వరకు ఆగాల్సిందే. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2013, 10:13 [IST]
English summary
Revealed first in the form of renderings a few weeks back, Nissan has now announced that it will give Indian customers the first view of the Terrano compact SUV on August 20th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+