నిస్సాన్ టెర్రానో: రేపే విడుదల, ఇంటర్నెట్‌లో ఫొటోలు లీక్!

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ ఇండియా, భారత మార్కెట్లో తమ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano)ను రేపు (ఆగస్ట్ 20, 2013) మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, విడుదలకు ఒక రోజు ముందే నిస్సాన్ టెర్రాన్ క్లియర్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఓ ఆటో ప్రియుడు ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఇప్పటి వరకు స్కెచ్‌లు, స్పైషాట్‌ల రూపంలో చూసిన టెర్రానోను ఇప్పుడు ఈ ఫొటోల్లో క్లియర్‌గా చూడొచ్చు. టెర్రానో స్కెచ్‌కు, రియల్ ఫొటోకు ఎలాంటి తేడాలు లేవు. నిస్సాన్ టెర్రానో డీలర్‌షిప్ కేంద్రాల వద్దకు చేరుకుంది. కొందరు డీలర్లు ఇప్పటికే టెర్రానోకు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం.

మరి ఆలస్యమెందుకు నిస్సాన్ టెర్రానోను అందరికన్నా ముందుగా చూసేద్దాం రండి..!

ఆగస్ట్ 20న అధికారికంగా విడుదల

ఆగస్ట్ 20న అధికారికంగా విడుదల

ఆగస్ట్ 20, 2013వ తేదీన తమ టెర్రానో ఎస్‌యూవీని విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే తమ టెర్రానో కాంపాక్ట్‌ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్ ఫొటోలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే.

డస్టర్-టెర్రానో క్లోనింగ్

డస్టర్-టెర్రానో క్లోనింగ్

నిస్సాన్ టెర్రానోను రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. అయితే, ఇతర రెనో-నిస్సాన్ క్లోనింగ్ మోడల్స్ (మైక్రా-పల్స్, సన్నీ-స్కాలా) మాదిరిగా కాకుండా డస్టర్‌తో పోల్చుకుంటే టెర్రానో పూర్తిగా విశిష్టమైన డిజైన్‌ను, ఫీచర్లను కలిగి ఉండనుంది.

పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్

పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్

నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్‌ నిస్సాన్ టెర్రానోలో నిస్సాన్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

అంచనా ధర

అంచనా ధర

భారత మార్కెట్లో నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

ఈ కారుకు సంబందించిన మరింత సమాచారం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 19, 2013, 13:22 [IST]
English summary
Nissan Terrano suv Images revealed in internet before Nissan unveils Terrano officially. Automobile enthusiast and Twitter user mrunalgandhi has managed to spot and click images of Terrano.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+