నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్ల వివరాలు లీక్!
జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం నిస్సాన్ ఇండియా ఈనెల 20న భారత మార్కెట్లో ఆవిష్కరించిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో'కు సంబంధించి మరింత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. నిస్సాన్ టెర్రాన్ ఆవిష్కరణ సమయంలో కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, ఈ కారుకు సంబంధించిమ సమాచారాన్ని కొంత కొంతగా నిస్సాన్ వెల్లడి చేస్తోంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, రెనో డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెర్రానో కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అయితే, పెట్రోల్ వెర్షన్ కేవలం ఎక్స్ఎల్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. డీజిల్ వెర్షన్ విషయానికి ఇది డస్టర్ మాదిరిగానే 85 పిఎస్ ఇంజన్, 110 పిఎస్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

డీజిల్ 85 పిఎస్ ఇంజన్ కలిగిన టెర్రానో ఎక్స్ఈ, ఎక్స్ఎల్-డి, ఎక్స్ఎల్-డి ప్లస్ అనే వేరియంట్లలోను, డీజిల్ 110 పిఎస్ ఇంజన్ కలిగిన టెర్రానో ఎక్స్ఎల్-డిస ఎక్స్‌వి-డి, ఎక్స్‌వి-డి ప్రీమియం అనే వేరియంట్లలో లభ్యం కానున్నట్లు సమాచారం. మొత్తమ్మీద చూసుకుంటే, నిస్సాన్ ఇండియా పెట్రోల్ వెర్షన్ టెర్రానో కన్నా డీజిల్ వెర్షన్ టెర్రానోకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి, నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినప్పటికీ, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఈ రెండు మోడళ్లు పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. అయితే, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లు మాత్రం ఒకేలా ఉంటాయి. ధర గురించి ఆలోచించే వారు డస్టర్‌ను, ప్రీమియం ఫీల్ గురించి ఆలోచించే వారు టెర్రానోను ఎంచుకోవచ్చు. మరి మీ ఛాయిస్ ఏంటి..?



Click it and Unblock the Notifications








