నిస్సాన్ టెర్రానో రియర్ ప్రొఫైల్ స్కెచ్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా టెర్రానో అనే ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ మోడల్ గురించి ఇప్పటికే తెలుగు డ్రైవ్ స్పార్క్ విభిన్న కథనాలను ప్రచురించటం కూడా జరిగింది. మనం ఇటీవలే టెర్రానో స్పై షాట్లను చూశాం. తాజాగా, నిస్సాన్ ఇండియా తమ టెర్రానో ఎస్‌యూవీకి సంబంధించి మరొక లేటెస్ట్ టీజర్ ఫొటోను విడుదల చేసింది.

గతంలో నిస్సాన్ టెర్రానో ఫ్రంట్ ప్రొఫైల్‌ను తెలియజేస్తూ ఓ టీజర్ ఫొటోను విడుదల చేయగా, ఇప్పుడు రియర్ ప్రొఫైల్‌ను తెలియజేస్తూ మరొక అఫీషియల్ స్కెచ్‌ను నిస్సాన్ ఇండియా విడుదల చేసింది. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న రెనో డస్టర్ డిజైన్‌తో పోల్చుకుంటే పూర్తి భిన్నంగా ఉండేలా నిస్సాన్ తమ టెర్రానోను డిజైన్ చేసింది.

ప్రొడక్షన్ వెర్షన్ టెర్రానోకు కంపెనీ విడుదల చేసిన అఫీషియల్ స్కెచ్‌లకు ఎలాంటి వ్యత్యాసం ఉండే అవకాశం లేదు. సాధారణంగా, రెనో అందిస్తున్న ఉత్పత్తులతో పోల్చుకుంటే నిస్సాన్ అందిస్తున్న ఉత్పత్తులు ధరలో కాస్తంత తక్కువగా అందుబాటులో ఉంటాయి. నిస్సాన్ టెర్రానో విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉండనుంది. టెర్రానోలో లభించనున్న ప్రీమియం ఫీచర్ల కారణంగా ఇది డస్టర్ ధర కన్నా కాస్తం అధిక ధరను కలిగి ఉండే ఆస్కారం ఉందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

నిస్సాన్ టెర్రానో రియర్ ప్రొఫైల్ స్కెచ్

నిస్సాన్ టెర్రానో రియర్ ప్రొఫైల్ స్కెచ్

నిస్సాన్ టెర్రానో ఫ్రంట్ ప్రొఫైల్ స్కెచ్

నిస్సాన్ టెర్రానో ఫ్రంట్ ప్రొఫైల్ స్కెచ్

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2013, 12:23 [IST]
English summary
Nearly a month after releasing the first official rendering of the Terrano SUV, Nissan has now revealed to us how the rear portion of the more premium version of the Renault Duster will look like in the latest rendering.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+