నిస్సాన్ టెర్రానో ఆవిష్కరణ; సెప్టెంబర్ 1 నుంచి బుకింగ్స్, ధర రూ.10 లక్షల లోపే!
కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano)ను జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం నిస్సాన్ ఇండియా నేడు (ఆగస్ట్ 20, 2013) భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నిస్సాన్ తమ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని టెర్రానోను ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను స్వీకరించడం సెప్టెంబర్ 1వ తేది నుంచి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.
నిస్సాన్ టెర్రానోను వాణిజ్య పరంగా అక్టోబర్ నెల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని, ఆ నెలలో ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ధర మరియు ఇతర వివరాలను వెల్లడిస్తామని నిస్సాన్ ఇండియా తెలిపింది. నిస్సాన్ టెర్రానోను కేవలం రెనో డస్టర్‌కు రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా కాకుండా, డస్టర్ కన్నా మరింత మెరుగ్గా, ప్రీమియంగా ఉండేలా డిజైన్ చేశారు.
టెర్రానోకు సంబంధించిన మరింత సమాటారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

నిస్సాన్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిభింభింపజేసే 'డబుల్ లేయర్ హెరిటేజ్ గ్రిల్'ను టెర్రానోలో గమనించవచ్చు. నిస్సాన్ ఎక్స్-ట్రైల్, పాత్‌ఫైండర్, పాట్రోల్ వంటి మోడళ్లలో కనిపించే గ్రిల్ మాదిరిగానే టెర్రానో గ్రిల్ ఉంటుంది. హెడ్‌లైట్స్ కూడా డస్టర్ కన్నా సన్నాగా, స్టయిలిష్‌గా ఉంటాయి.

రెనో డస్టర్ కన్నా నిస్సాన్ టెర్రానో కొద్దిగా పొడవుగా అనిపిస్తుంది. పెద్ద బంపర్, ఫెండర్లే ఇలా అనిపించడానికి కారణం. బాడీ కలర్ రూఫ్ రెయిల్స్ మరొక ప్రధాణ ఆకర్షణ. బి, సి పిల్లర్స్ మాత్రం నలుపు రంగులో ఉన్నాయి. ఇందులో 16 ఇంచ్ మెషీన్ పాలిష్డ్ అల్లాయ్ వీల్స్ మరొక ప్రత్యేకత.

బేసిక్ ఇంటీరియర్ డిజైన్‌ను మాత్రం అలానే ఉంచారు. డోర్ల లోపలి వైపు ఫాక్స్ ఉడ్ డోర్ హ్యాండిల్స్, డ్యాష్ బోర్డుపై మధ్యలో ఏర్పాటు చేసిన ఎయిర్ వెంట్స్, అక్కడక్కడా ఉడ్ అండ్ క్రోమ్ గార్నిష్, రీడిజై చేసిన స్టీరింగ్ వీల్ ఇందులో సరికొత్త ఫీచర్లు.

నిస్సాన్ టెర్రానో వెనుక వైపు రివర్స్ ల్యాంప్‌తో కూడిన స్ప్లిట్ కాంబినేషన్ ల్యాంప్ (సగం బూట్ డోరుపై, సగం బాడీపై ఉంటుంది) ఇందులో కొత్త ఫీచర్. లైసెన్స్ ప్లేట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది.

నిస్సాన్ టెర్రానో బ్రాంజ్ గ్రే, పెరల్ వైట్, సఫైర్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, ఫైర్ రెడ్, స్టెర్లింగ్ గ్రే వంటి కలర్లలో ఇది లభ్యం కానుంది. ఇంజన్స్ విషయానికి వస్తే, రెనో డస్టర్‌లో ఉపయోగించిన ఇంజన్లనే (1.6 లీటర్ పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్లు) నిస్సాన్ టెర్రానోలోను ఉపయోగించనున్నారు.


Click it and Unblock the Notifications








