'నిస్సాన్ నోట్ బోట్': నీటిపై తేలియాడేకారు

By Ravi

కారు పడవైతే.. ఎలా ఉంటుంది, ఇదిగో ఈ ఫొటోలో కనిపించినట్లుగా ఉంటుంది. నీటిపై తేలియాడే కార్ల గురించి మన ఇదివరకే తెలుసుకున్నాం. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహా కార్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. అయితే, ఇలాంటి కార్లు ప్రత్యేకమైన టెక్నాలజీ, విశిష్టమైన బాడీతో డిజైన్ ఇవుతాయి.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఓ రెగ్యులర్ కారు గురించి, కానీ ఇది రెగ్యులర్ కార్ల కన్నా భిన్నంగా ఉంటుంది. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ అందిస్తున్న 'నోట్' (Note) అనే చిన్న కారును, కంపెనీ ఫ్లోటింగ్ కారు (నీటిపై తేలియాడే కారు)గా మార్చేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే, ఈ కథనం చదవండి..!!

నిస్సాన్ నోట్ బోట్

నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్ల కోసం రూపొందించిన నోట్ చిన్న కారును విడుదల కార్యక్రమాన్ని విశిష్టమైన రీతిలో నిర్వహించింది.

నిస్సాన్ నోట్ బోట్

ఈ కార్యక్రమం కోసం కంపెనీ ఫ్లోటింగ్ వెర్షన్ నిస్సాన్ నోట్ కారును తయారు చేసింది. కారును నీటిపై తేలియాడేలా, కారు క్రింది భాగంలో తేలికపాటి ప్లాస్టిక్ భాగాన్ని ఉపయోగించారు.

నిస్సాన్ నోట్ బోట్

ఈ ఫ్లోటింగ్ వెర్షన్ కారును 'నోట్ బోట్' (Note Boat) అని పిలుస్తారు.

నిస్సాన్ నోట్ బోట్

నోట్ బోట్‌లో వెనుక వెరుసలోని సీట్లను తొలగించి, ఆ ఫ్లాట్‌ఫామ్‌పై పడవను ముందుకు, వెనుకకు నడిపేందుకు వీలుగా ఉండేలా తెడ్లను అమర్చారు.

నిస్సాన్ నోట్ బోట్

ఈ తెడ్లను కారుకు అమర్చేందుకు కొన్ని ప్రత్యేక విడిభాగాలను ఉపయోగించారు.

నిస్సాన్ నోట్ బోట్

ఇటీవల జరిగిన ఒలంపింక్‌లో స్వర్ణ పతకాలు సాధించిన హెలెన్ గ్లోవర్, సోఫీ హాస్కింగ్‌లు ఈ నోట్ బోట్ కారును నడిపారు.

నిస్సాన్ నోట్ బోట్

నోట్ బోట్‌లో ఇంజన్‌ను తొలగించారు. స్టీరింగ్ వీల్ సాయంతో ఈ ఫ్లోటింగ్ కారు దిశను మార్చేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.

నిస్సాన్ నోట్ బోట్

నిస్సాన్ ఫ్లోటింగ్ నోట్ బోట్ కారు పనితీరును చూపించే వీడియోను తర్వాతి స్లైడ్‌లో వీక్షించండి.

నిస్సాన్ ఫ్లోటింగ్ నోట్ బోట్ కారు పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 26, 2013, 11:28 [IST]
English summary
The UK’s motoring press descended on Eton to witness the new Nissan Note being launched in unusual fashion. Dubbed ‘the Note Boat’, it had been equipped with a rowing seat and oars and powered by Team GB rowers Polly Swann and Olympic gold medallists Helen Glover and Sophie Hosking.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+