దీపావళి కానుకగా రానున్న డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి

By Ravi

నిస్సాన్‌కు చెందిన పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ డాట్సన్ తమ గో (GO) హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'గో+' (GO+) (గో ప్లస్ అని పలకాలి) అనే ఎమ్‌పివిని గడచిన ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ ఎమ్‌పివిని దీపావళి నాటికి మార్కెట్లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

డాట్సన్ గో ప్లస్ మల్టీ పర్సప్ వెహికల్‌ను ఈ పండుగ సీజన్‌లో విడుదల చేస్తామని, అలాగే డాట్సన్ గో ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మూడో మోడల్‌ను 2015లో విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా తెలిపారు. భారత మార్కెట్లో చిన్న కార్లు, ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌పై కూడా దృష్టి సారించామని ఆయన వివరించారు.

కాగా.. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే వీటిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

డాట్సన్ గో ప్లస్ ఒక సెవన్ సీటర్ ఎమ్‌పివి, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మొత్తం 3995 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కూడా 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభిస్తుంది. ఈ ఫొటోలో దీని ఇంటీరియర్ లుక్‌ను చూడొచ్చు.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌‌రూమ్ ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత స్థలాన్ని పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివి అంత చిన్న డోర్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు.

డాట్సన్ గో ప్లస్

మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు కానీ లేదా కొంచెం లావుగా ఉన్న వారు కానీ ఇందులో సౌకర్యంగా కూర్చోలేరు.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి రియర్ లుక్.

More from DriveSpark

Article Published On: Friday, April 18, 2014, 10:05 [IST]
English summary
Datsun has unvieled Go plus MPV at Auto Expo 2014. GO hatchback and GO+ compact MPV are based on the same platform. The Datsun GO+ MPV will be launched in India by Diwali.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+