ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రేస్ కార్
జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్, ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయటంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, డెల్టావింగ్ డిజైన్‌ను ఆధారంగా చేసుకొని నిస్సాన్ ఓ సరికొత్త ప్రోటోటైప్ రేసింగ్ కారును అభివృద్ధి చేసింది. జియోడ్ ఆర్‌సీ (ZEOD RC)గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ రేసింగ్ కారు డెల్టావింగ్ మాదిరిగానే వచ్చే ఏడాది జరగనున్న 24 అవర్స్ లీమ్యాన్స్ రేసులో పాల్గొననుంది.
తాము అభివృద్ధి చేసిన ఈ జియోడ్ ఆర్‌సి ఎలక్ట్రిక్ రేసు కారు ప్రంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే రేసింగ్ కారని నిస్సాన్ పేర్కొంది. ఇది గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని కంపెనీ తెలిపింది. 'జియోడ్ ఆర్‌సి' అంటే జీరో ఎమిషన్ ఆన్ డిమాండ్ రేసింగ్ కార్ (ZEOD RC) అని అర్థం. ఈ కారుకు సంబంధించిన సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మరి ఈ జియోడ్ రేసింగ్ కారుపై ఓ కన్నేద్దాం రండి..!



















Click it and Unblock the Notifications








