ఆన్‌లైన్ ద్వారా స్కొడా ఆక్టావియాను బుక్ చేసుకోండి

By Ravi

స్కొడా ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త ప్రీమియం సెడాన్ 2013 ఆక్టావియా కోసం కంపెనీ ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. స్కొడా కస్టమర్లు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా తమ ఫేవరేట్ ఆక్టావియా సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వారు ప్రతి బుకింగ్‌కి కేవలం రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వారికి పూర్తిగా 100 శాతం బుకింగ్ మొత్తాన్ని కంపెనీ తిరిగి కస్టమర్లకు వెనక్కు ఇచ్చేస్తుంది.

ఈ ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా కేవలం స్కొడా ఆక్టావియా సెడాన్‌ను మాత్రమే కాకుండా, తాము అందిస్తున్న ఏ స్కొడా కారునైనా బుక్ చేసుకోవచ్చునని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్ చేసి స్కొడా కారును బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు మిగిలిన మొత్తాన్ని తాము ఎంచుకునే అధీకృత స్కొడా డీలర్‌షిప్ కేంద్రంలో చెల్లించవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ కోసం www.bookyourskodaonline.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2013 స్కొడా ఆక్టావియా ధరలు, ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్కొడా ఆక్టావియా

భారత మార్కెట్లో కొత్త స్కొడా ఆక్టావియా ప్రారంభ ధర రూ.13.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త 2013 స్కొడా ఆక్టావియా మూడు వేరియంట్లలో (యాక్టివ్, యాంబిషన్, ఎలిగాన్స్), పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్) లభ్యమవుతుంది.

స్కొడా ఆక్టావియా

అన్ని స్కొడా ఆక్టావియా వేరియంట్లలో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, పవర్ విండోస్, ఏబిఎస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, రిమోట్ లాకింగ్, రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానున్నాయి.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

స్కొడా ఆక్టావియా 1.4 లీటర్ పెట్రోల్, మ్యాన్యువల్

* యాక్టివ్ - రూ.13.95 లక్షలు

* యాంబిషన్ - రూ.14.95

స్కొడా ఆక్టావియా 1.8 లీటర్ పెట్రోల్, ఆటోమేటిక్

* యాక్టివ్ - రూ.18.25 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

స్కొడా ఆక్టావియా 2.0 లీటర్ డీజిల్

* యాక్టివ్ - రూ.15.55 లక్షలు (మ్యాన్యువల్)

* యాంబిషన్ - రూ.16.55 లక్షలు (మ్యాన్యువల్)

* యాంబిషన్ - రూ.17.55 లక్షలు (ఆటోమేటిక్)

* ఎలిగాన్స్ - రూ.19.45 లక్షలు (ఆటోమేటిక్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్

1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్

కొత్త స్కొడా ఆక్టావియాలో 1.4 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

2.0 లీటర్ డీజిల్ ఇంజన్

2.0 లీటర్ డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ ఆక్టావియా విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ టిడిఐ (టర్బో) ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 148 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పవర్‌ఫుల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్

పవర్‌ఫుల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్

ఇందులో చివరి ఇంజన్ ఆప్షన్ 1.8 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్. శక్తివంతమైన హైపెర్ఫామెన్స్ ఆక్టావియాను కోరుకునే వారి కోసం కంపెనీ ఈ ఇంజన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది గరిష్టంగా 177 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

2013 స్కొడా ఆక్టావియా రివ్యూ

2013 స్కొడా ఆక్టావియా రివ్యూ

More from DriveSpark

Article Published On: Thursday, October 17, 2013, 12:06 [IST]
English summary
Skoda Auto India has opened the online bookings for its New Octavia which has been recently introduced in the market. Customers can book their car at a nominal booking amount of INR 5,000 with an option of 100% money back in case of a cancellation. The booking amount can be paid online through net banking, debit card or credit card.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+