రిఫ్రెష్డ్ చెవర్లే బీట్‌ను విడుదల చేసిన జనరల్ మోటార్స్
జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు చెవర్లే బీట్‌లో రిఫ్రెష్డ్ వెర్షన్‌న సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రిఫ్రెష్డ్ చెవర్లే బీట్ ఎక్స్టీరియర్స్, ఇంజన్‌లలో ఎలాంటి మార్పులు లేవు, కేవలం ఇంటీరియర్లను మాత్రమే అప్‌గ్రేడ్ చేశారు.
స్టయిలిష్ లుక్, ప్రీమియం ఫీల్‌ను కల్పించేలా కొత్త బీట్ ఇంటీరియర్స్‌కు సిల్వర్ టచ్ ఇచ్చారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్, స్టీరింగ్ వీల్, డోర్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లపై సిల్వర్ ఫినిషింగ్‌ను జోడించారు. ఇంటీరియర్స్‌ను మరింత మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దారు.
కొత్త బీట్‌లో ఇప్పుడు డ్రైవర్ సీట్ అడ్జస్టబల్ ఆప్షన్‌తో లభిస్తుంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో అడ్జస్టబల్ డ్రైవర్ సీటును జోడింటారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో భాగంగా, జనరల్ మోటార్స్ తమ చెవర్లే బీట్‌ను కేవలం రూ.3.39 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఆఫర్ చేస్తుంది.
చెవర్లే బీట్ పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్ గరిష్టంగా 80.5 పిఎస్‌ల శక్తిని, డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించి 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 58.5 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
పెట్రల్ వెర్షన్ బీట్ లీటరుకు 18.6 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ బీట్ లీటరుకు 25.44 కి.మీ. మైలేజీని మరియు ఎల్‌పిజి వెర్షన్ బీట్ లీటరుకు 13.3 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా.. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా అప్‌డేట్ చేయబడిన ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లు
జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు చెవర్లే బీట్‌లో రిఫ్రెష్డ్ వెర్షన్‌న సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రిఫ్రెష్డ్ చెవర్లే బీట్ ఎక్స్టీరియర్స్, ఇంజన్‌లలో ఎలాంటి మార్పులు లేవు, కేవలం ఇంటీరియర్లను మాత్రమే అప్‌గ్రేడ్ చేశారు.

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
డ్యాష్‌బోర్డుపై సిల్వర్ ఫినిషింగ్

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
స్టీరింగ్ వీల్‌పై సిల్వర్ టచ్

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి కూడా సిల్వర్ ఫినిషింగ్ టచ్‌ను అందించారు.

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
డోర్ ప్యానెల్స్‌పై సిల్వర్ ఫినిషింగ్

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
సరికొత్త సీట్ కవర్స్, ఫ్రంట్ కప్ హోల్డర్స్

రిఫ్రెష్డ్ ఇంటీరియర్లతో చెవర్లే బీట్
ఆల్ పవర్ విండోస్

చెవర్లే బీట్ కలర్స్
సూపర్ రెడ్

చెవర్లే బీట్ కలర్స్
కాక్‌టైల్ గ్రీన్

చెవర్లే బీట్ కలర్స్
మిస్టీ లేక్

చెవర్లే బీట్ కలర్స్
కావియర్ బ్లాక్

చెవర్లే బీట్ కలర్స్
లీనెన్ బీజ్

చెవర్లే బీట్ కలర్స్
సమ్మిట్ వైట్

చెవర్లే బీట్ కలర్స్
శాండ్రిఫ్ట్ గ్రే

చెవర్లే బీట్ కలర్స్
స్విచ్ బ్లేడ్ సిల్వర్


Click it and Unblock the Notifications








