అఫీషియల్: జూన్ 2013లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రియులకు శుభవార్త. మీరు కూడా ఈ బుజ్జి ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీ ఎదురుచూపులు వచ్చే నెలలో ఫలించనున్నాయి. గడచిన కొద్ది కాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులను ఊరిస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను జూన్ 2013లో విడుదల చేస్తామని ఫోర్డ్ ఇండియా అధికారికంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో బుకింగ్‌లను కూడా జూన్ ఆరంభంలో ప్రారంభించనున్నారు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌లో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.
ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‍యూవీ ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, వేరొకటి 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో చూడండి..!

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
ఆంబీంటే వేరియంట్:
ఇది బేస్ వేరియంటే అయినప్పటికీ ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో పాటుగా బ్లూటూత్ మరియు ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, మల్టీ ఫంక్షన్, ఫ్రంట్ పవర్ విండోస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో పార్సెల్ ట్రే కనిపించదు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
ట్రెండ్ వేరియంట్:
ఇక రెండవ వేరియంట్ ట్రెండ్ విషయానికి వస్తే, ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), పవర్ విండోస్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టమెంట్, స్టీరియో వీల్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
టైటానియం వేరియంట్:
టైటానియం వేరియంట్‌లో పైన తెలిపిన ఫీచర్లతో పాటుగా లెథర్ స్టీరింగ్ వీల్ కవర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లవ్ బాక్స్, రూఫ్ రెయిల్స్, ఫాగ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, 16 అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
టైటానియం వేరియంట్ ఆప్షనల్:
ఈ టైటానియం వేరియంట్‌ను పుష్-బటన్ స్టార్ట్, లెథర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఆప్షనల్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications








