టీఎస్‌ రిజిస్ట్రేషన్ ఇష్యూ: కేవలం స్టేట్, జిల్లా కోడ్స్ మాత్రమే మారుతాయ్!

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణా జిల్లాల్లో ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల పాత వాహనాలను కొత్తగా టీఎస్ సిరీస్‌తో మార్చడం అంత సులువైన అంశం కాదని రవాణా శాఖ అధికారులు గురువారం తేల్చి చెప్పడంతో కేసీఆర్ సర్కారు దీనిపై పునరాలోచన చేసింది. ఈ మేరకు వాహన నంబర్ ప్లేట్ల అంశంపై రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

తెలంగాణలో వాహనాల నంబర్లు నంబర్ ప్లేట్లు పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని, AP స్టేట్ కోడ్ స్థానంలో TS టీఎస్ కోడ్‌ని మార్చి, స్టేట్ కోడ్‌ని కూడా మార్చుకుంటే సరిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో కేవలం కోడ్స్ మాత్రమే మారుతాయని, వాహనాల నంబర్లు పాతవే ఉంటాయని ఆయన తెలిపారు. అయితే, పాత వాహనాల విషయంలో ఈ మార్పు ప్రక్రియ రవాణా శాఖ ద్వారానే జరగాలి.

KCR

వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే ఈ సమస్య వచ్చినట్లు సమచారం. నాలుగు నెలల్లో పాత వాహనాలన్నింటికీ నంబర్లు మార్చాల్సిందేనని రవాణా శాఖ మంత్రి బుధవారం చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు రావటంతో తెలంగాణా సర్కారు ఈ అంశాన్ని పునఃపరిశీలించింది. మరోవైపు రవాణాశాఖ అధికారులు దీనిని అమలు చేయటం కష్టమని చేతులెత్తేయటంతో చేసేది లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2014, 9:33 [IST]
English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao said on Thursday that only state and district codes in the vehicle registration numbers would change. ‘AP’ will change to ‘TS’ and the district codes will also be changed. However, the numbers will remain the same.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+