పిసిపి మోటార్స్ నుంచి మోటార్‌హోమ్, కార్‌వ్యాన్
ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే టోటల్ ఎన్‌వీహెచ్ రిడక్షన్ కాంపోనెంట్‌లను తయారు చేసే ప్రముఖ కంపెనీ పారాకోట్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (పిసిపి) తమ మోటార్ హోమ్ కాన్సెప్ట్స్ 'పిసిపి టెర్రా' మరియు 'పిసిపి కేర్'లను ఇండియాలో విడుదల చేసింది.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకొని, కంపెనీ ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. పిసిపి మోటార్స్ గడచిన 2012లోనే టెర్రా మోటార్‌హోమ్ కాన్సెప్ట్‌ను భారత్‌కు పరిచయం చేసింది. ఈసారి ఆటో ఎక్స్‌పోలో కంపెనీ మూడు విభిన్న ఇంటీరియర్ వేరియంట్లను ప్రవేశపెట్టింది.
వ్యక్తుల అభిరుచులు, అవసరాలను పరిగణలోకి తీసుకొని ఈ మోటార్‌హోమ్ ఇంటీరియర్లను కస్టమైజ్ చేస్తారు. ఈ మోటార్‌హోమ్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా జీనియో లేదా ఇసుజు డి-మ్యాక్స్ వంటి పికప్ ట్రక్కులను ఆధారంగా చేసుకొని ధృఢమైన ఫైబర్‌గ్లాస్ (ఎఫ్ఆర్‌పి) మెటీరియల్‌తో తయారు చేయబడిన ఫ్రేమ్‌ను ఈ పికప్ వాహనాలకు ఫిక్స్ చేయడం జరుగుతుంది.

మహీంద్రా జీనియో లేదా ఇసుజు డి-మ్యాక్స్ వంటి పికప్ ట్రక్కులను ఆధారంగా చేసుకొని ధృఢమైన ఫైబర్‌గ్లాస్ (ఎఫ్ఆర్‌పి) మెటీరియల్‌తో తయారు చేయబడిన ఫ్రేమ్‌ను ఈ పికప్ వాహనాలకు ఫిక్స్ చేయడం జరుగుతుంది.

లోపలి వైపు అత్యంత విలాసవంతమైన, బెస్ట్-ఇన్-క్లాస్ ఇంటీరియర్స్‌తో ఈ మోటార్‌హోమ్‌ను పిసిపి డిజైన్ చేసింది. ఒక చిన్న కుటుంబం లేదా ఏడు మంది ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) ఈ పిసిపి టెర్రా హోమ్ కారులో ప్రయాణించవచ్చు.

విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్, లివింగ్/మీటింగ్ రూమ్ (అవసరం లేదనుకుంటే బెడ్‌రూమ్‌గా మార్చుకుని ఐదుగురు హాయిగా నిద్రపోవచ్చు. ఎయిర్ కండిషనర్, హీటర్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, వాష్ రూమ్, షవర్, షెల్ఫ్స్, కిచెన్ కోసం ఉపయోపడే డ్రాయర్స్, టివి, రేడియో, డివిడి, ఎమ్‌పి3తో కూడిన స్టీరియో మల్టీ మీడియా సిస్టమ్, మంచి నీటిని, చెడు నీటిని సూచించే ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ పిసిపి హోమ్ కమ్ ఆఫీ కార్‌లో ఉండే ప్రత్యేకమైన, విశిష్టమైన ఫీచర్లు.

అంతేకాకుండా ఈ కారుకు వెనుకవైపు ఓ కెమెరా ఉంటుంది. ఈ కెమరాను డ్రైవర్ క్యాబిన్‌లోని సెంటర్ కన్సోల్‌పై ఉండే మోనిటర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని వలన డ్రైవింగ్ చేసేటప్పుడు మోటార్‌హోమ్ వెనుక వచ్చే వాహనాల రాకపోకలను చూడవచ్చు.

రక్షణదళంలోని వ్యక్తులు, మౌళిక రంగ కంపెనీలు, కార్పోరేట్లు, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, రాజకీయ నాయకులు మొదలైన వారిని దృష్టిలో ఉంచుకొని పిసిపి ఈ హోమ్ కారును డిజైన్ చేసింది.

భారత్‌లో పిసిపి టెర్రా మోటార్‌హోమ్ ధరలు రూ.31.83 లక్షల నుండి రూ.34.72 లక్షల (మోడల్‌ను బట్టి, పన్నులు కలుపుకోకుండా) రేంజ్‌లో ఉన్నాయి. ఆర్డర్ చేసిన 13-15 వారాల్లో వీటిని డెలివరీ చేస్తారు.

వెన్నెముక, మోకాళ్ల సమస్యలతో బాధపడుతూ, కార్లలోకి ఎక్కి దిగలేని వారి కోసం పిసిపి కేర్ పేరిట కంపెనీ ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఇందుకోసం మారుతి ఈకో కారును ఉపయోగించారు. ఇందులో సౌకర్యవంతమైన ఓ హైడ్రాలిక్ సీటును అమర్చారు. ఒక్క బటన్ నొక్కగానే ఈ సీట్ నేరుగా కారులో క్రిందకు వస్తుంది, అలాగే ప్యాసింజర్ కూర్చున్న తర్వాత బటన్ నొక్కగానే ఇది యధా స్థానానికి చేరుకుంటుంది. ఈ హైడ్రాలిక్ సీటును ఏర్పాటు చేసేందుకు కంపెనీ రూ.3.69 లక్షలు (పన్నులు కలుపుకోకుండా) వసూలు చేస్తుంది. దీని డెలివరీకి పట్టే సమయం 10-12 వారాలు.

ఆటో ఎక్స్‌పో 2014లో పిసిపి మోటార్స్ ఆవిష్కరించిన మోటార్ హోమ్ కాన్సెప్ట్స్ 'పిసిపి టెర్రా' మరియు 'పిసిపి కేర్'.


Click it and Unblock the Notifications








