మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ సూపర్‌కార్ - మీకు నచ్చిందా?
సూపర్‌కార్లను తయారు చేయటం ఇటలీ, జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద పెద్ద దేశాలకే సాధ్యమనుకుంటే పొరపాటే. అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోకుండా తాము కూడా అత్యంత స్టయిలిష్‌గా ఉండే సూపర్‌కార్లను తయారు చేసి చూపించగలమంటోంది ఫిలిప్పీన్స్.
ఇది కూడా చదవండి: ఆటోరిక్షాలో బెంగుళూరు నుంచి లండన్ ప్రయాణం!
ఇదిగో ఈ ఫొటోలో మీరు చూస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో తయారైన సూపర్‌కార్. ఇదే మొట్టమొదటి మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ సూపర్‌కార్ కావటం విశేషం. ఈ కారు పేరు ఔరెలియో (Aurelio). ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫ్యాక్టర్ ఔరెలియో అనే కంపెనీ ఈ విశిష్టమైన కారును డిజైన్ చేసింది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ ఔరెలియో సూపర్‌కార్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫ్యాక్టర్ ఔరెలియో అనే కంపెనీ ఈ విశిష్టమైన కారును తయారు చేస్తోంది. ఈ కారును రెండు ఇంజన్ ఆప్షన్లలో ఆఫర్ చేస్తున్నారు.

కస్టమర్ల ఎంపిక మేరకు హోండా బి16ఏ వి-టెక్ ఇంజన్‌తో కానీ లేదా మిత్సుబిషి 4జి63టి టర్బోచార్జ్డ్ 2.0 లీటర్ ఇంజన్‌తో కానీ లభిస్తుంది.

కాగా.. ఈ సూపర్‌కారులో ఉపయోగించిన ఇంజన్లకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ వివరాలు, ఇతర సాంకేతిక వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఔరెలియో కారును తేలికగా ఉంచేందుకు గాను దీనిని ఫైబర్‌గ్లాస్, రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ అలాగే కార్బన్ ఫైబర్ పదార్థాలతో తయారు చేసినట్లు సమాచారం.

మనదేశంలో కూడా డిసి డిజైన్స్ ఈ తరహాలోనే అవంతి అనే స్పోర్ట్స్ కారును తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. మరి ఈ మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ ఔరెలియో సూపర్‌కారు డిజైన్ మీకు నచ్చిందా..?
Photo credit: Michael Xerxes


Click it and Unblock the Notifications








