ఆటో ఎక్స్‌పో 2014: పియాజ్జియో ఎన్‌టి3 కాన్సెప్ట్
ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్ పియాజ్జియోకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ 'పియాజ్జియో వెహికల్స్' ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించి వీక్షకుల మది దోచుకుంది. ఈ కాన్సెప్ట్ పేరు 'పియాజ్జియో ఎన్‌టి3' (Piaggio NT3).
చిన్నసైజు సిటీ కారులా కనిపించే ఈ కాన్సెప్ట్ నిజానికి ఓ క్వాడ్రిసైకిల్ (నాలుగు చక్రాల వాహనం). భారత ఆటోమొబైల్ రంగంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభించబడనున్న క్వాడ్రిసైకిల్ విభాగంలో ప్రవేశించేందుకే పియాజ్జియ ఈ కాన్సెప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.
పియాజ్జియో ఎన్‌టి3 ఓ తేలికపాటి నాలుగు చక్రాల వాహనం. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా మిలాన్‌లో జరిగిన 2010 ఈఐసిఎమ్ఏ షోలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుంచి నాలుగేళ్లు గడిచినా ఇది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉండిపోయింది. పియాజ్జియో ఎన్‌టి3 కాన్సెప్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

పియాజ్జియో ఎన్‌టి3 తేలికపాటి బరువును, కాంపాక్ట్ డిజైన్‌ను మరియు చిన్నసైజు ఇంజన్‌ను కలిగి ఉండి, ఇది భారత్‌లో క్వాడ్రిసైకిల్ విభాగం పరిధిలోకి వస్తుంది.

గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటి వరకు ఉత్పత్తి దశకు చేరుకోని ఈ కాన్సెప్ట్, మన ఇండియాలో క్వాడ్రిసైకిల్‌గా ఉత్పత్తి దశకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

పియాజ్జియో ఎన్‌టి3 ఓ నాలుగు చక్రాలు మరియు మూడు సీట్లు కలిగిన వాహనం. ఇందులో ముందు వరుసలో ఒక సీట్ (డ్రైవర్ కోసం), వెనుక వరుసలో రెండు సీట్లు (ప్యాసింజర్ల కోసం) ఉంటాయి.

పియాజ్జియో ఎన్3ని కంపెనీ మూడు ఇంజన్ వేరియంట్లతో తయారు చేసింది. అవి - 230సీసీ పెట్రోల్ ఇంజన్, 350సీసీ పెట్రోల్ ఇంజన్ మరియు 350సీసీ పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన హైబ్రిడ్ వెర్షన్.

రెగ్యులర్ (నాన్-హైబ్రిడ్) వెర్షన్ పియాజ్జియో ఎన్‌టి3 గరిష్టంగా లీటరుకు 33 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది ప్రతి కిలోమీటరుకు 70 గ్రాముల కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.


Click it and Unblock the Notifications








