ఆటో ఎక్స్‌పో 2014: వెస్పా 946 స్కూటర్ ఆవిష్కణ
ఇటలీకి చెందిన టూవీలర్ బ్రాండ్ వెస్పా మరో సరికొత్త ప్రీమియం స్కూటర్‌ను భారత్‌కు పరిచయం చేసింది. విడుదలైన కొద్ది కాలంలో ప్రపంచం ప్రఖ్యాతి పొందిన 'వెస్పా 946' (Vespa 96) మోడల్‌ను ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది.
విశిష్టమైన డిజైన్ కలిగిన ఈ వెస్పా 946 స్కూటర్ కొద్దిరోజుల్లోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇది ఆషామాషీ స్కూటర్ కాదు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ స్కూటర్‌ను 2011లో జరిగిన మిలాన్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించారు.
పైకి తేలినట్టుండే విశాలమైన సీట్ (సింగిల్ సీట్ మాత్రమే), విభిన్నమైన హ్యాండిల్‌బార్, డిజిటల్ డిస్‌ప్లే, ఇటాలియన్ స్టయిల్‌ను ప్రతిభింభింపజేసే బాడీ డిజైన్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ వెస్పా 946 స్కూటర్ సొంతం. ఈ స్కూటర్ పూర్తిగా చేతుల్తో తయారు చేయబడినది (హ్యాండ్ మేడ్). ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌లలో పరిశీలించండి.

ఈ స్కూటర్ బాడీ, హ్యాండిల్ బార్, శాడల్ సపోర్ట్, సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ మడ్‌గార్డ్‌లను అల్యూమినియం మూలకాలతో కూడిన ధృడమైన షీట్ స్టీల్‌తో తయారు చేశారు.

వెస్పా 946 లగ్జరీ స్కూటర్‌లో 4 స్ట్రోక్, 125 సీసీ, మోనో సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, 3 వాల్వ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇంజన్ సొంతం. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న వెస్పా స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది భిన్నమైనది.

ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఏఎస్ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద 12 ఇంచ్ వీల్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్‌తో వెస్పా 946 ఈ సెగ్మెంట్లో కెల్లా సురక్షితమైన స్కూటర్‌గా నిలువనుంది.

ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ మరియు ఎల్‌సిడి డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

గ్లోబల్ మార్కెట్లో వెస్పా 946 స్కూటర్ ధరలు ఆయా దేశాలను బట్టి రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

పూర్తిగా విదేశాల్లో తయారైన వెస్పా 946 స్కూటర్‌ను భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.

పియాజ్జియో వెస్పా స్కూటర్‌ను తొలిసారిగా 1946లో తయారు చేసింది. అందుకే ఈ స్కూటర్‌కు 'వెస్పా 946' (ఆ సంవత్సరంలోని చివరి 3 అంకెలు) అనే పేరును పెట్టారు.


Click it and Unblock the Notifications








