ఉత్తరాఖాండ్‌లో సేవల కోసం 5 ఆల్-టెర్రైన్ వాహనాలు దానం
ఉత్తరాఖాండ్ వరద బాధితులను ఆదుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హోండా మోటార్ కంపెనీలు వరద బాధితుల కోసం ధన, వస్తు సాయం చేయగా, తాజాగా పోలారిస్ ఐదు ఆల్-టెర్రైన్ వాహనాలను ఉత్తరాఖాండ్ ప్రభుత్వానికి దానం చేసింది. సదరు వాహనాల తాళం చెవులను ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగణకు పోలారిస్ అధికారులు అందజేశారు.
ప్రపంచపు నెంబర్ ఆల్-టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ అయిన, అమెరికాకు చెందిన పోలారిస్ దానం చేసిన ఐదు ఆల్-టెర్రైన్ వాహనాలలో ఒక స్పోర్ట్స్‌మ్యాన్ బిగ్ బాస్ 6x6 800, ఒక స్పోర్ట్స్‌మ్యాన్ 550 హంటర్ ఈపిఎస్, ఒక ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800 ఈఎఫ్ఐ మరియు రెండు రేంజర్ 900 డీజిల్ వాహనాలున్నాయి. రానున్న రెండేళ్ల పాటు ఈ ఐదు వాహనాలకు పోలారిస్ ఉచితంగా రిపేర్లు, సర్వీసు సేవలను కూడా అందించనుంది.
రోడ్లు కోల్పోయిన కేథారినాథ్ మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించే సిబ్బంది ప్రయాణించేందుకు ఈ ఆఫ్-రోడింగ్ వాహనాలు చక్కగా సహకరిస్తాయి. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఐదు ఆల్-టెర్రైన్ వాహనాలు
స్పోర్ట్స్‌మ్యాన్ బిగ్ బాస్ 6x6 800 - 1 యూనిట్
స్పోర్ట్స్‌మ్యాన్ 550 హంటర్ ఈపిఎస్ - 1 యూనిట్
ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800 ఈఎఫ్ఐ - 1 యూనిట్
రేంజర్ 900 డీజిల్ - 2 యూనిట్లు

సిఎం నివాసంలో దానం
డెహ్రడూన్‌లోని సిఎం నివాసంలో పోలారిస్ అధికారులు ఈ ఐదు వాహనాలను వరద బాధితుల సహాయార్థం సేవలందించేందుకు గాను దానం చేశారు. రెండేళ్ల పాటు ఈ ఐదు వాహనాలకు రిపేర్లు, సర్వీసు ఖర్చులను కూడా పోలారిస్ సంస్థే భరించనుంది.

మీడియాతో మాట్లాడుతున్న సిఎం
ఈ కార్యక్రమం అనంతరం వరద సహాయక చర్యల గురించి, వరద బాధితులను ఆదుకునేందుకు పోలారిస్ అందించిన సాయం గురించి మీడియా మాట్లాడుతున్న ఉత్తరాఖాండ్ సిఎం విజయ్ బహుగుణ.

సిఎంకు తాళం చెవులు అందిస్తున్న పంకజ్ దూబే
ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు తాళం చెవులు అందజేస్తున్న పోలారిస్ ఇండియా హెడ్ పంకజ్ దూబే.


Click it and Unblock the Notifications








